News August 30, 2024

నాలుగోసారి కూడా అధికారం మాదే: మోదీ

image

రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలినా 2029లో కూడా గెలిచి నాలుగోసారి అధికారంలోకి వస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌లో ఆయన మాట్లాడుతూ కొందరు రాజకీయ విశ్లేషకులు ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మోజారిటీ సాధించలేదని, దాంతో తాను ప్రజాదరణ కోల్పోయానని చెబుతున్నారని అన్నారు. 2029లో జరిగే ఫిన్‌టెక్ ఫెస్ట్‌కు కూడా తానే వస్తానని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News

News December 13, 2025

హనుమాన్ చాలీసా భావం – 37

image

జై జై జై హనుమాన గోసాయీ|
కృపా కరహు గురు దేవ కీ నాయీ||
గురువు మన అజ్ఞానాన్ని తొలగించి జీవితానికి సరైన మార్గం చూపిస్తారు. అలాగే హనుమంతుడు కూడా ఆ గురువులాగే దయ చూపి మనల్ని కష్టాల కడలి నుంచి తప్పిస్తాడు. ధైర్యాన్ని, సన్మార్గాన్ని ప్రసాదించి, నిరంతరం మనల్ని రక్షిస్తూ విజయం చేకూరేలా ఆశీర్వదిస్తాడు. ఈ శ్లోకం ద్వారా తులసీదాస్ హనుమకు జయం పలికి, ఆయన శక్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నాడు. <<-se>>#HANUMANCHALISA<<>>

News December 13, 2025

కేరళలోనూ వికసిస్తున్న కమలం!

image

కేరళ రాజకీయాల్లో BJP ప్రభావం క్రమంగా పెరుగుతోంది. తాజా లోకల్ బాడీ ఎన్నికలలో తిరువనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీ నేతృత్వంలోని NDA విజయ ఢంకా మోగించింది. మొత్తం 101 వార్డులలో ఎన్డీయే 50 గెలవగా, LDF 29, UDF 19 సాధించాయి. ఇప్పటికే 2024 LS ఎన్నికల్లో త్రిసూర్ నుంచి నటుడు, BJP నేత సురేశ్ గోపి MPగా గెలిచారు. ఆ పార్టీ ఇప్పుడు కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ఇది కేరళలో కమలం వికాసాన్ని సూచిస్తోంది.

News December 13, 2025

హైదరాబాద్ దూరదర్శన్‌ కేంద్రంలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

image

హైదరాబాద్ <>దూరదర్శన్<<>> కేంద్రంలో 11 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీటిలో తెలుగు, ఉర్దూ న్యూస్ రీడర్, వీడియో ఎడిటర్, అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్, కాపీ ఎడిటర్, అసిస్టెంట్ వెబ్‌సైట్ ఎడిటర్, బ్రాడ్‌కాస్ట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. న్యూస్ రీడర్లకు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా.. మిగతా పోస్టులకు 50ఏళ్లు. వెబ్‌సైట్: https://prasarbharati.gov.in