News November 14, 2024
తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన ఖరారు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 21, 22 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 21న హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి NTR స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవానికి హాజరవుతారు. 22న హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో లోక్‌మంతన్-2024 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రపతి పర్యటనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.
Similar News
News December 9, 2024
అన్ని గురుకులాల్లో ఒకే ఫుడ్ మెనూ: మంత్రి
TG: రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో ఒకే ఫుడ్ మెనూ అమలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బీసీ గురుకులాలపై సమీక్షించిన ఆయన, విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్కూళ్లలో సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, అనారోగ్యం బారిన పడిన విద్యార్థులకు వెంటనే వైద్యం అందించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత, ఆహారం నాణ్యతలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 9, 2024
SHOCKING: యూట్యూబ్‌లో పుష్ప-2 స్ట్రీమింగ్
పుష్ప-2 నిర్మాతలకు మరో షాక్ తగిలింది. మూవీ విడుదలైన రోజే పలు ఆన్‌లైన్ సైట్లలో లీకవగా తాజాగా కొందరు యూట్యూబ్‌లో హిందీ వెర్షన్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ ఘటనలపై మేకర్స్ ఇంకా స్పందించలేదు. త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని సమాచారం.
News December 9, 2024
14 ఏళ్ల బాలిక తెగింపు.. ఓ దేశాన్ని కదిలించింది
సిరియా అధ్యక్షుడు, డాక్టర్ బషర్ అల్ అసద్ దేశాన్ని వీడటంతో ఆ దేశం రెబల్స్ వశమైంది. ఈ పోరాటానికి 14 ఏళ్ల బాలిక తెగింపు ఆజ్యం పోసింది. అసద్ అరాచకాలను తట్టుకోలేక 2011లో ఆమె దారా అనే గ్రామంలోని గోడలపై ‘ఇక నీ వంతు డాక్టర్’ అని గ్రాఫిటీ చిత్రాలు వేసింది. దీంతో ఆ బాలిక, స్నేహితురాళ్లను పోలీసులు 26 రోజులు హింసించారు. ఈ క్రమంలో దారాలో మొదలైన తిరుగుబాటు దేశంలో అంతర్యుద్ధానికి దారితీసి అసద్ పతనంతో ముగిసింది.