News October 8, 2024
ఆ కాఫీ ధర రూ.335.. అందులో బొద్దింక!

ఢిల్లీలోని ఖాన్ మార్కెట్లో లోపెరా బేకరీలో ఓ కస్టమర్ రూ.335 ఖరీదైన ఐస్డ్ లాటే ఆర్డర్ ఇచ్చారు. తాగే సమయంలో ఏదో కాఫీ గింజలా తేలుతుండటంతో స్పూన్‌తో వెనక్కి తిప్పారు. తీరా చూస్తే అది బొద్దింక. ఈ విషయాన్ని ఆమె రెడిట్‌లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్ అయింది. ఆమెకు క్షమాపణలు చెప్పి, డబ్బులు వెనక్కిచ్చామని, మరో కాఫీ ఆఫర్ చేశామని బేకరీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే మరో కాఫీ తాగేందుకు ఆ కస్టమర్ సాహసించలేదు.
Similar News
News November 10, 2025
దళిత ఉద్యమ కెరటం డాక్టర్ కత్తి పద్మారావు

సాహిత్యం, దళిత ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి కత్తి పద్మారావు అని BR అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఘంటా చక్రపాణి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చంద్రశేఖరరెడ్డి అన్నారు. విమలా స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం-2025 పద్మారావుకు ప్రకటించారు. నిన్న అనంతపురంలో జరిగిన సభకు అనివార్య కారణాల వల్ల పద్మారావు హాజరుకాలేదు. పురస్కారాన్ని ఆయన కుమారుడు చేతన్ అందుకున్నారు.
News November 10, 2025
మరో బస్సు ప్రమాదం.. 30 మంది సేఫ్

AP: పల్నాడు(D) రాజుపాలెం(M) రెడ్డిగూడెం వద్ద మరో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఒరిగిపోయింది. రోడ్డు విస్తరణ పనులకు ఏర్పాటుచేసిన పైపులను తగిలి బస్సు ఆగిపోయింది. దీంతో అప్రమత్తమైన 30 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాల నుంచి బయటకు దూకేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
News November 10, 2025
‘వెంటనే తొలగిస్తున్నాం’.. CEO సహా ఉద్యోగులకు HR మెయిల్!

HR డిపార్ట్మెంట్ చేసిన పొరపాటు గురించి ఓ ఉద్యోగి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘మా కంపెనీ ఆఫ్‌బోర్డింగ్ ఆటోమేషన్ టూల్‌ను టెస్ట్ చేస్తోంది. లైవ్ మోడ్ నుంచి టెస్ట్ మోడ్‌కు మార్చడాన్ని మర్చిపోయింది. దీంతో ‘మీ చివరి పని దినం వెంటనే అమల్లోకి వస్తుంది’ అని CEO సహా 300 మందికి ఈమెయిల్స్ వచ్చాయి. అయితే తప్పు తెలుసుకుని తర్వాత మరో మెసేజ్ చేసింది. ఎవరినీ తొలగించలేదని చెప్పింది’ అని రెడిట్‌లో రాసుకొచ్చాడు.


