News January 7, 2025
ఈ కోడి గుడ్డు ధర రూ.700
AP: సాధారణంగా బ్రాయిలర్ కోడి గుడ్డు ధర రూ.6-8, నాటు కోడి గుడ్డు అయితే రూ.10-13 పలుకుతుంది. అయితే పందెం కోడి గుడ్డుకు రూ.400-700 వరకు డిమాండ్ ఉంటోంది. తూర్పు కోడి, ఎర్ర కక్కెర, తెల్ల కోడి గుడ్డు రూ.400 వరకు, తెల్ల కెక్కర, ఎర్రమైల, అబ్రాసు మైల జాతుల గుడ్డు రూ.700 వరకు పలుకుతోంది. ఈ గుడ్లను ప్రత్యేక నాటుకోళ్లతో పొదిగిస్తారు. కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లో చాలా మందికి ఇదొక కుటీర పరిశ్రమగా మారింది.
Similar News
News January 18, 2025
సైఫ్ అలీ ఖాన్‌కు రూ.25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్!
కత్తి దాడి నుంచి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నారు. వైద్య ఖర్చులకు గాను ఆయన Niva Bupaలో రూ.35.95 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినట్లు ఓ డాక్యుమెంట్ బయటికొచ్చింది. రూ.25 లక్షలు అప్రూవ్ చేసినట్లు అందులో ఉంది. ఈ వార్తలపై కంపెనీ స్పందిస్తూ ఆయన ఫైనల్ బిల్లులు సమర్పించిన తర్వాత మొత్తాన్ని సెటిల్ చేస్తామని పేర్కొంది. ఎంత క్లెయిమ్ చేశారనేది అధికారికంగా తెలపలేదు.
News January 18, 2025
మహాకుంభమేళా: రోజూ లక్ష మంది ఆకలి తీరుస్తున్న ఇస్కాన్
మహాకుంభమేళాలో భక్తులు, వర్కర్ల ఆకలి తీర్చేందుకు ఇస్కాన్-అదానీ గ్రూప్ చేతులు కలిపాయి. రోజూ దాదాపు లక్ష మందికి ఆహారాన్ని అందిస్తున్నాయి. ఇందులో దాల్, చోలే/రాజ్మా, వెజిటబుల్ కర్రీ, రోటీ, రైస్‌తోపాటు హల్వా/బూందీ లడ్డూ ఉన్నాయి. పిడకలతో మట్టి పొయ్యిపై ఈ ఫుడ్‌ను వండటం మరో విశేషం. 100 వాహనాల ద్వారా ప్రయాగ్‌రాజ్‌లోని మొత్తం 40 ప్రాంతాల్లో ఆహారాన్ని సరఫరా చేస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధి చెప్పారు.
News January 18, 2025
భారీ ఎదురుదెబ్బ: మావో కీలక నేతతో పాటు 17 మంది మృతి
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో ఇటీవల జరిగిన <<15172708>>ఎన్‌కౌంటర్‌లో<<>> మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌తో పాటు 17 మంది మృతి చెందినట్లు ఆ పార్టీ ప్రకటించింది. చొక్కారావు 30 ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. ఇతనిపై రూ.50 లక్షల రివార్డు ఉంది. స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి.