News March 30, 2024
పెరగనున్న స్మార్ట్ టీవీల ధరలు!

స్మార్ట్ టీవీల ధరలు ప్రియం కానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్యానెల్ ధరలు పెరగడంతో టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని కౌంటర్‌పాయింట్స్ ఐవోటీ సర్వీస్ వెల్లడించింది. అయితే ప్రీమియం మోడల్స్‌కు దేశంలో డిమాండ్ ఉండడంతో స్మార్ట్‌టీవీ దిగుమతులు 9శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఆఫ్‌లైన్‌తో పోలిస్తే ఆన్‌లైన్‌లో టీవీల విక్రయాలు దూసుకుపోతున్నాయి.
Similar News
News April 12, 2026
అందమైన భార్య కావాలి.. తుర్కియేకు ఉగాండా ఆర్మీ చీఫ్ షాకింగ్ డిమాండ్!

ఉగాండా ఆర్మీ చీఫ్ ముహూజీ కైనెరుగాబా మరోసారి SMలో రచ్చ చేశారు. తుర్కియే నుంచి ఏకంగా $1 బిలియన్ కావాలని డిమాండ్ చేశారు. లేదంటే రాయబార కార్యాలయం మూసేస్తామని, సంబంధాలు కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. శాంతి కోసం తుర్కియే అమ్మాయిలను ఉగాండా వాళ్లకు ఇచ్చి పెళ్లిళ్లు చేయాలని, తనకు అందమైన అమ్మాయి భార్యగా కావాలంటూ పెద్ద వివాదానికే దారితీశారు. తమ సైనికశక్తిని తక్కువ అంచనా వేయొద్దంటూ హెచ్చరించారు.
News April 12, 2026
మే 13 నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్స్

TG: వచ్చే నెలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. మే 13 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని పేర్కొంది. మే 22 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయని వెల్లడించింది. ఏప్రిల్ 13 నుంచి 20 వరకు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించవచ్చని తెలిపింది.
News April 12, 2026
ఇంటర్ ఫలితాల్లో ఈ జిల్లానే టాప్

TG: ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 82.73 పాస్ పర్సంటేజ్‌తో టాప్‌లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో జయశంకర్ భూపాలపల్లి(82.34), కొమురం భీమ్(82.16), ములుగు(82.12) ఉన్నాయి. అత్యల్పంగా సిరిసిల్ల జిల్లాలో 58.69% నమోదైంది. ఇక ఫస్టియర్ ఫలితాల్లోనూ మేడ్చల్ (77.31%) టాప్ ప్లేస్ దక్కించుకుంది. తర్వాతి స్థానంలో రంగారెడ్డి(76.38) ఉంది. అత్యల్పంగా సిరిసిల్లలో 49.05% మంది పాసయ్యారు.


