News February 18, 2025
విభజన హామీలను పవనే సాధించాలి: ఉండవల్లి

AP: రాష్ట్ర అవసరాలు, విభజన హామీలు సాధించుకోవడానికి ఇదే సరైన సమయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పవన్ తలుచుకుంటే ఇది సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే విషయమై పవన్కు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. విభజన హామీలో రాష్ట్రానికి రూ.75,050 కోట్లు రావాలని, దీనిపై పార్లమెంటులో ప్రస్తావించాలని కోరినట్లు వెల్లడించారు. జగన్, చంద్రబాబు సాధించలేని విభజన హామీలు పవన్ సాధించాలని సూచించారు.
Similar News
News November 22, 2025
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ జీవో విడుదల

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో 46ను విడుదల చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని జీవోలో స్పష్టం చేసింది. SC, ST, BC, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయనుంది. ST రిజర్వేషన్లు ఖరారయ్యాక SC, BC రిజర్వేషన్లు ఉంటాయి. రేపు సా.6 గంటల్లోపు ఖరారు చేసిన రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖకు కలెక్టర్లు అందించనున్నారు.
News November 22, 2025
ఇంజినీరింగ్ విద్యార్థినులకు JNTU హైదరాబాద్ గొప్ప అవకాశం

బీటెక్ చదివిన ప్రతి విద్యార్థినికి ఉద్యోగం రావాలని JNTU హైదరాబాద్ అధికారులు కొత్త ఆలోచనను అమల్లోకి తీసుకొచ్చారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కొద్దిపాటి తేడాతో ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన విద్యార్థినులకు ఆరు నెలలు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు సాధించేందుకు సాయం చేయనున్నారు. ఇందుకోసం బెంగళూరులోని ఎమర్టెక్స్ అనే ఐటీ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. JNTUలో చదివితే ఉద్యోగం ఖాయం అనే ధీమాను కల్పిస్తున్నారు.
News November 22, 2025
IIITకల్యాణిలో నాన్ టీచింగ్ పోస్టులు

IIITకల్యాణి, పశ్చిమబెంగాల్లో 6 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. వీటిలో డిప్యూటీ రిజిస్ట్రార్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ ఇంజినీర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి పీజీ, CA/ICWA, ME, M.Tech, MSc, MCA, డిగ్రీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://iiitkalyani.ac.in


