News February 18, 2025

విభజన హామీలను పవనే సాధించాలి: ఉండవల్లి

image

AP: రాష్ట్ర అవసరాలు, విభజన హామీలు సాధించుకోవడానికి ఇదే సరైన సమయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పవన్ తలుచుకుంటే ఇది సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే విషయమై పవన్‌కు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. విభజన హామీలో రాష్ట్రానికి రూ.75,050 కోట్లు రావాలని, దీనిపై పార్లమెంటులో ప్రస్తావించాలని కోరినట్లు వెల్లడించారు. జగన్, చంద్రబాబు సాధించలేని విభజన హామీలు పవన్ సాధించాలని సూచించారు.

Similar News

News March 16, 2025

టెస్లా కోసం ప్రభుత్వం ప్రయత్నాలు.. భూముల పరిశీలన

image

AP: అమెరికాకు చెందిన ఆటోమోటివ్ కంపెనీ టెస్లాను రాష్ట్రానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తిరుపతి జిల్లా మేనకూరు, సత్యవేడులోని శ్రీసిటీతో పాటు కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీలో భూములను పరిశీలిస్తున్నారు. ఈ మూడు ప్రాంతాలు చెన్నైకి 120 కి.మీ దూరంలో ఉండటం, విమానాశ్రయాలు, పోర్టులు, నేషనల్ హైవేలు దగ్గరగా ఉండటం కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

News March 16, 2025

పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య.. కొత్త విషయాలు

image

కాకినాడలో చంద్రశేఖర్ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో పెద్ద కొడుకు జోషిల్ (6)ను రూ.లక్షల్లో ఫీజులు ఉన్న ఓ స్కూల్లో చేర్పించాడు. ఆర్థిక ఇబ్బందులతో చిన్న స్కూలుకు మార్చాడు. లక్షలు కట్టి చదివించగలనా? ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడగలరా? అనే ఆత్మన్యూనతతో ఇలా చేసినట్లు భావిస్తున్నారు. చంద్రశేఖర్ అంత కర్కశుడు కాదని బంధువులు చెబుతున్నారు.

News March 16, 2025

అమరావతి కోసం రూ.11వేల కోట్లు.. నేడు ఒప్పందం

image

AP: నేడు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో), సీఆర్డీఏ మధ్య ఒప్పందం కుదరనుంది. రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ ఏడాది జనవరి 22న హడ్కో రూ.11వేల కోట్ల రుణం మంజూరు చేసింది. నేడు సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదరనుంది. అగ్రిమెంట్ అయ్యాక హడ్కో నిధులను విడుదల చేయనుంది.

error: Content is protected !!