News January 8, 2025

రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు!

image

AP: వయసు మీదపడిన తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే వారికి రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2007 సీనియర్ సిటిజన్ల చట్టం ప్రకారం తమను పిల్లలు సరిగా చూసుకోవట్లేదని తల్లిదండ్రులు ట్రైబ్యునల్ అధికారిగా ఉండే RDOకు ఫిర్యాదు చేయవచ్చు. విచారణలో నిజమని తేలితే RDO ఇచ్చే ఆదేశాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లు ఆస్తి డాక్యుమెంట్లను రద్దు చేస్తారు.

Similar News

News January 26, 2025

కుంభమేళా.. నాగసాధువుల గురించి ఈ విషయాలు తెలుసా?

image

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వేలసంఖ్యలో నాగసాధువులు తరలివచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. నాగసాధువులు ఒంటి మీద నూలుపోగు లేకుండా హిమాలయాల్లో ధ్యానం చేస్తుంటారు. విపరీతమైన చలి, ఎండకు కూడా వీరు చలించరు. అన్ని రుతువులకు తట్టుకునేలా అగ్నిసాధన, నాడీ శోధన, మంత్రపఠనం చేసి శరీరం, మనసుపై నియంత్రణ పొందుతారు. రోజులో ఒక్కసారి మాత్రమే భోజనం తీసుకుంటారు. వీరు చనిపోయిన చోటే సమాధి చేస్తారు.

News January 26, 2025

మహ్మద్ షమీకి మళ్లీ మొండిచేయే..!

image

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కలేదు. తొలి టీ20లో స్థానం దక్కకపోయినా రెండో మ్యాచులోనైనా ఆయనను ఆడిస్తారని అంతా భావించారు. కానీ మేనేజ్‌మెంట్ అతడిని పెవిలియన్‌కే పరిమితం చేసింది. దీంతో చాన్నాళ్లకు షమీ బౌలింగ్ చూద్దామనుకున్న అభిమానులకు మరోసారి అసంతృప్తే మిగిలింది. మూడో టీ20లోనైనా ఆయనకు ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News January 26, 2025

అది షో ఆఫ్ ఎలా అవుతుంది?: ఊర్వశీ రౌతేలా

image

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి గురించి మాట్లాడే సమయంలో హీరోయిన్ ఊర్వశీ రౌతేలా తన ఆభరణాల గురించి మాట్లాడటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఊర్వశీ స్పందించారు. ‘సైఫ్‌పై దాడి విషయాలు నాకు అంతగా తెలియవు. నాకు తెలిసినంత వరకు చెప్పా. అదే సమయంలో నాకు బహుమతిగా వచ్చిన కానుకల గురించి చెప్పా. ఇది ఏమాత్రం షో ఆఫ్ కాదు. అదే నిజమైతే నా చేతికి ఉన్న చిన్న వాచ్‌ను కూడా చూపించేదాన్ని’ అని చెప్పారు.