News April 27, 2024

IPL నుంచి వైదొలిగిన పంజాబ్ ఆల్‌రౌండర్

image

పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ సికందర్ రజా ఐపీఎల్ నుంచి వైదొలిగారు. వచ్చే నెలలో బంగ్లాతో టీ20 సిరీస్ ఉండటంతో ఈ జింబాబ్వే ప్లేయర్ స్వదేశానికి వెళ్లారు. బంగ్లా, జింబాబ్వే మధ్య మే 3 నుంచి 12 వరకు ఐదు టీ20లు జరగనున్నాయి. ఈ సిరీస్ అనంతరం అతడు మళ్లీ పంజాబ్ జట్టులో చేరే అవకాశముంది. ‘పంజాబ్‌కు ధన్యవాదాలు. IPLలో ప్రతి నిమిషం ఎంజాయ్ చేశా. దేశానికి ఆడాల్సిన సమయం వచ్చింది. మళ్లీ కలుద్దాం’ అని రజా ట్వీట్ చేశారు.

Similar News

News April 15, 2026

పాడి రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి

image

రోజుకు రెండు లీటర్లు పాలిచ్చే 5 ఆవులను పోషించే బదులు.. రోజుకు 10 లీటర్లు పాలిచ్చే ఒక సంకరజాతి ఆవును పోషించడం ఎంతో లాభసాటిగా ఉంటుందని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాడి పశువుల పోషణ వ్యయంలో 60 నుంచి 70 శాతం వ్యయం దాణా, గడ్డి, మందులకే ఖర్చవుతుంది. పాడి పరిశ్రమను లాభసాటిగా సాగించాలంటే పాడి పశువుల మేపుపై అదుపు, సంకరజాతి పశువుల పోషణపై సరైన అవగాహన కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

News April 15, 2026

ముగింపు దశలో యుద్ధం.. కానీ: ట్రంప్

image

ఇరాన్‌తో రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్‌తో యుద్ధం ముగింపు దశకు చాలా దగ్గరగా ఉందన్నారు. అయితే అమెరికా పని ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. ‘వారు ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడే మా బలగాలను ఉపసంహరించుకుంటే ఆ దేశాన్ని తిరిగి నిర్మించుకోవడానికి 20 ఏళ్లు పడుతుంది’ అని పేర్కొన్నారు.

News April 15, 2026

మరింత పెరగనున్న వాహనాల ధరలు?

image

నిర్వహణ ఖర్చులు పెరిగాయంటూ ఇప్పటికే ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరలు పెంచుతున్నాయి. యుద్ధం మరింత కాలం కొనసాగితే ఉత్పత్తి వ్యయం పరిమితికి మించి పెరిగి రేట్లు మరింత పెంచాల్సి రావొచ్చని భారత వాహన తయారీదారుల సమాఖ్య(సియామ్) అధ్యక్షుడు శైలేశ్ చంద్ర తెలిపారు. కమోడిటీ ధరలు ఏమేర పెరుగుతాయనేది 4-5 వారాల్లో స్పష్టత రావొచ్చన్నారు. ఆ తర్వాతే వాహనాల రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని వెల్లడించారు.