News July 3, 2024
‘ది రాజా సాబ్’.. ఈ నెలలోనే ప్రభాస్ సీన్స్ షూటింగ్?

‘కల్కి’ విజయంతో జోరుమీదున్న డార్లింగ్ ప్రభాస్ తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టనున్నారు. మారుతి తెరకెక్కిస్తోన్న ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్లో ఈ నెల నుంచి పాల్గొననున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈనెల 15 తర్వాత ప్రభాస్కు సంబంధించిన సీన్స్ షూట్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని 2025లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘కల్కి’ రూ.వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతోంది.
Similar News
News November 27, 2025
పసిపిల్లలు సరిపడా పాలు తాగుతున్నారా?

ఆరు నెలల లోపు శిశువులకు తల్లి పాలను మించిన సంపూర్ణ ఆహారం లేదు. అయితే శిశువు తగినన్ని పాలు తాగుతున్నారో.. లేదో తెలుసుకోవడానికి వారి మూత్రాన్ని పరిశీలించాలంటున్నారు నిపుణులు. శిశువులు ప్రతి 4 నుంచి 6 గంటలకు మూత్ర విసర్జన చేస్తారు. ఆ యూరిన్ రంగు నీటిలా ఉంటే వాళ్లు పాలు సరిగ్గా తాగుతున్నారని అర్థం. అలాగే బిడ్డకు ప్రతి మూడుగంటలకు పాలివ్వాలి. రాత్రిపూట కూడా 2,3సార్లు పాలు పట్టించాలని చెబుతున్నారు.
News November 27, 2025
ANRFలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్( <
News November 27, 2025
నటిని పెళ్లి చేసుకున్న మాజీ క్రికెటర్

తమిళ బిగ్బాస్ ఫేమ్ సంయుక్త షణ్ముఘనాథన్ను మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కుమారుడు, IPL మాజీ ప్లేయర్ అనిరుద్ధ శ్రీకాంత్ వివాహమాడారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడంతో కుటుంబసభ్యుల సమక్షంలో జరిగినట్లు సినీవర్గాలు తెలిపాయి. సంయుక్త నటిగా, మోడల్గా గుర్తింపు పొందగా.. అనిరుద్ధ IPLలో 2008 నుంచి 14 వరకూ CSK, SRH జట్లకు ప్రాతినిధ్యం వహించారు. వివాహానికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.


