News July 3, 2024
‘ది రాజా సాబ్’.. ఈ నెలలోనే ప్రభాస్ సీన్స్ షూటింగ్?

‘కల్కి’ విజయంతో జోరుమీదున్న డార్లింగ్ ప్రభాస్ తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టనున్నారు. మారుతి తెరకెక్కిస్తోన్న ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్‌లో ఈ నెల నుంచి పాల్గొననున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈనెల 15 తర్వాత ప్రభాస్‌కు సంబంధించిన సీన్స్ షూట్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని 2025లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘కల్కి’ రూ.వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతోంది.
Similar News
News February 16, 2026
బంగారం ధర ₹లక్షకు తగ్గుతుందా?

అమెరికా, రష్యా మధ్య డాలర్‌తో వాణిజ్యం జరిగితే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘US డాలర్‌తో ట్రేడ్‌కు రష్యా సిద్ధమవుతోందని బ్లూమ్‌బర్గ్ చెప్పింది. అదే జరిగితే 10 గ్రాముల గోల్డ్ ₹1 లక్షకు పడిపోవచ్చు. 2027 చివరి నాటికి ₹90 వేలు-₹లక్ష మధ్య స్థిరపడొచ్చు’ అని స్ట్రాటజిస్ట్ అమిత్ గోయల్ అన్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1.57 లక్షలుగా ఉంది.
News February 16, 2026
T20 WCలో ఇవాళ్టి మ్యాచులు..

T20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి. 11AMకు అఫ్గాన్‌తో UAE, 3PMకు ఇంగ్లండ్‌తో ఇటలీ, 7PMకు ఆస్ట్రేలియాతో శ్రీలంక తలపడనున్నాయి. గెలిస్తే ఇంగ్లండ్, శ్రీలంక సూపర్8కి చేరుకోనున్నాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా ఓడితే అవకాశాలు సన్నగిల్లనున్నాయి. ప్రస్తుతం ఇండియా, వెస్టిండీస్ మాత్రమే అధికారికంగా సూపర్ 8కి క్వాలిఫై అయ్యాయి.
News February 16, 2026
మాజీ ఎంపీ కన్నుమూత

AP: రాజ్యసభ మాజీ MP తడపట్ల రత్నాబాయి(79) కన్నుమూశారు. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో పోలవరం(D) రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆమె చనిపోయారు. రత్నాబాయి 1972లో ఎల్లవరం(ప్రస్తుతం ర.చోడవరం) నుంచి కాంగ్రెస్ MLAగా గెలిచారు. 2008లో MPగా, 2014-20 వరకు MLCగా సేవలందించారు. అటు BC ఉద్యమ నేత, మాజీ MLC ఐలాపురం వెంకయ్య(93) అనారోగ్య సమస్యలతో నిన్న విజయవాడలో తుదిశ్వాస విడిచారు.


