News August 20, 2024

రాష్ట్ర పరిస్థితికి తార్కాణాలు ఇవే: కేటీఆర్

image

TG: రాష్ట్రంలో పరిస్థితులకు ఇవే తార్కాణాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నిజామాబాద్‌లో పోలీసుల వేధింపులతో విసుగు చెంది ఓ స్వీటు షాపు యజమాని తన దుకాణం ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు Xలో మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మరోవైపు వరంగల్‌లో రద్దీ రహదారిపై మంత్రి సురేఖ పుట్టినరోజు వేడుకల్లో ఏసీపీ పాల్గొన్నారని ఫొటోను షేర్ చేశారు. ఈ వేడుకల్లో క్రాకర్స్ కాల్చడంతో అమాయకులు గాయపడ్డారని రాసుకొచ్చారు.

Similar News

News January 15, 2025

అరవింద్ కేజ్రీవాల్‌కు ముప్పు: ఇంటెలిజెన్స్ సోర్సెస్

image

ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌‌కు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులను అలర్ట్ చేసినట్టు సమాచారం. ఖలిస్థానీ వేర్పాటువాదుల నుంచి ఆయనకు ముప్పు ఉందని చెప్పినట్టు తెలిసింది. ఈ విషయాన్ని అటు ఆప్, ఇటు కేంద్రం అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం కేజ్రీవాల్‌కు Z-కేటగిరీ సెక్యూరిటీ ఉంది. నేడు హనుమాన్ మందిరంలో పూజలు చేశాక ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు.

News January 15, 2025

మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్

image

ఆస్ట్రేలియా క్రికెటర్ మార్నస్ లబుషేన్, ఆయన సతీమణి రెబెకా ఈ ఏడాది ఏప్రిల్‌లో తమ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తమకు బాబు పుట్టబోతున్నాడంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో లబుషేన్ పోస్ట్ పెట్టారు. ‘ముగ్గురం నలుగురం కాబోతున్నాం’ అని పేర్కొన్నారు. లబుషేన్, రెబెకాకు 2017 వివాహం జరగగా, 2022లో కూతురు హాలీ జన్మించింది.

News January 15, 2025

SHOCK: టీవీల్లో ‘గేమ్ ఛేంజర్’!

image

‘గేమ్ ఛేంజర్’ సినిమా ఏపీలోని కేబుల్ టీవీలో ప్రసారం అవుతున్నట్లు తెలుస్తోంది. ‘AP LOCAL TV’ ఛానల్లో పైరసీ HD ప్రింట్ ప్రసారం చేస్తున్నారని కొందరు నెటిజన్లు X వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. కాగా ఈ సినిమా విడుదలకు ముందే కుట్రలు జరిగాయని మూవీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.