News August 20, 2024
రాష్ట్ర పరిస్థితికి తార్కాణాలు ఇవే: కేటీఆర్
TG: రాష్ట్రంలో పరిస్థితులకు ఇవే తార్కాణాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నిజామాబాద్‌లో పోలీసుల వేధింపులతో విసుగు చెంది ఓ స్వీటు షాపు యజమాని తన దుకాణం ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు Xలో మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మరోవైపు వరంగల్‌లో రద్దీ రహదారిపై మంత్రి సురేఖ పుట్టినరోజు వేడుకల్లో ఏసీపీ పాల్గొన్నారని ఫొటోను షేర్ చేశారు. ఈ వేడుకల్లో క్రాకర్స్ కాల్చడంతో అమాయకులు గాయపడ్డారని రాసుకొచ్చారు.
Similar News
News September 14, 2024
కోహ్లీతో పోరాటం కోసం ఎదురుచూస్తున్నా: స్టార్క్
ఈ ఏడాది నవంబరులో ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీకి బౌలింగ్ వేసేందుకు ఎదురుచూస్తున్నానని ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ అన్నారు. విరాట్‌తో పోరాటం బాగుంటుందన్నారు. ‘మేమిద్దరం ఒకరితో ఒకరు చాలా క్రికెట్ ఆడాం. మా పోరాటంలో ఉండే మజాను ఆస్వాదిస్తుంటాను. తను నాపై రన్స్ చేశారు. నేనూ ఆయన్ను ఔట్ చేశాను. ఈసారి పోరు ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు.
News September 14, 2024
గుజరాత్‌లో తీవ్ర విషాదం
గుజరాత్‌లోని దేగాం తాలూకాలో జరిగిన వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులు నీటిలో మునిగి చనిపోయారు. వస్నా సోగ్తికి చెందిన కొందరు యువకులు గణేషుడిని నిమజ్జనం చేసేందుకు మాషో నదికి వెళ్లారు. నిమజ్జనం అనంతరం ఓ యువకుడు ఈత కొడుతూ మునిగిపోయాడు. అతడిని కాపాడేందుకు ఒకరి తర్వాత మరొకరు నీటిలో దూకి మునిగిపోయారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
News September 14, 2024
సెప్టెంబర్ 14: చరిత్రలో ఈ రోజు
1883: స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జననం
1923: ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ జననం
1958: అవధాని గరికపాటి నరసింహారావు జననం
1962: సినీ నటి మాధవి జననం
1967: హైదరాబాద్ మాజీ సీఎం బూర్గుల రామకృష్ణారావు మరణం
1990: టీమ్ ఇండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ జననం
హిందీ భాషా దినోత్సవం