News August 28, 2024

‘స్పాట్’ బాధ్యతలు మళ్లీ కాలేజీలకే

image

TG: కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్ల భర్తీ బాధ్యతలను మరోసారి కాలేజీల యాజమాన్యాలకే విద్యాశాఖ అప్పగించింది. స్పాట్ కౌన్సెలింగ్ కోసం ఇవాళ కాలేజీలు ఖాళీల వివరాలను వెల్లడించనున్నాయి. ప్రవేశాల కోసం రేపు వివరాలతో పత్రిక ప్రకటన జారీ చేస్తాయి. 30 నుంచి SEP 2 వరకు స్పాట్ ప్రవేశాలు జరగనున్నాయి. 19 ప్రభుత్వ కాలేజీల్లో 1,600 సీట్లు మిగలగా తొలిసారిగా వాటి భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

Similar News

News September 10, 2024

భారత స్టేడియంపై అఫ్గానిస్థాన్ టీమ్ ఆగ్రహం

image

అఫ్గానిస్థాన్ జట్టు తమ హోమ్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడుతుంటుంది. గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ స్టేడియంలో ఆ జట్టు న్యూజిల్యాండ్‌తో సోమవారం నుంచి టెస్టు ఆడాల్సి ఉంది. వర్షం లేకపోయినా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గ్రౌండ్ చిత్తడిగా ఉండి తొలి రెండ్రోజుల మ్యాచ్ రద్దైంది. దీంతో అఫ్గాన్ జట్టు సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్టేడియంలో ఇంకెప్పుడూ మ్యాచులు ఆడేది లేదని మండిపడ్డారు.

News September 10, 2024

ట్రంప్ ఓడితే.. అమెరికన్లకు మస్క్ హెచ్చరిక

image

రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతే అమెరికాకు ఇవే ఆఖరి అసలు సిసలైన ఎన్నికలు అవుతాయని బిలియనీర్ ఎలాన్ మస్క్ హెచ్చరించారు. కోటిన్నర మంది అక్రమ వలసదారుల్ని సక్రమం చేసేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరింత మందిని తీసుకొచ్చి వారు స్వింగ్ స్టేట్స్ గెలిచి అమెరికాను ఏకపార్టీ రాజ్యంగా మార్చేస్తారని తెలిపారు. 1986 ఆమ్నెస్టీ సంస్కరణలతో కాలిఫోర్నియా ఇలాగే మారిందని గుర్తుచేశారు.

News September 10, 2024

రూ.5వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లు: భట్టి విక్రమార్క

image

TG: రాష్ట్రంలో ఏటా రూ.20వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఆర్థిక సంఘం సమావేశంలో ఆయన రాష్ట్ర పథకాలపై వివరించారు. అక్షరాస్యత పెంపునకు రూ.5వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. వీటిని నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో తీసుకొస్తామన్నారు. టాటా కంపెనీ సహకారంతో 65 ఐటీఐలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.