News November 23, 2024

UP ఉపఎన్నికల్లో ఫలితాలు ఇలా..

image

ఉత్తర్‌ప్రదేశ్‌లోని 9 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇందులో 6 చోట్ల బీజేపీ, 2 స్థానాల్లో ఎస్పీ, ఒక చోట RLD ముందంజలో ఉన్నాయి. అటు ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో బీజేపీ అభ్యర్థి ఆశా నాటియాల్ లీడింగ్‌లో కొనసాగుతున్నారు.

Similar News

News December 9, 2024

సిరియాపై భారత ప్రభుత్వ కీలక ప్రకటన

image

సిరియాలో పరిస్థితుల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఐక్యత, సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకు ఆ దేశంలోని అన్ని వర్గాలూ కలిసి పనిచేయాలని సూచించింది. ‘అన్ని వర్గాల ఆకాంక్షలు, ప్రయోజనాలను గౌరవిస్తూ సమ్మిళిత సిరియా నాయకత్వంలో రాజకీయ ప్రక్రియ శాంతియుతంగా సాగాలని మేం కోరుకుంటున్నాం’ అని MEA తెలిపింది. అక్కడి భారతీయులంతా క్షేమంగా ఉన్నారని వెల్లడించింది.

News December 9, 2024

బీజేపీ నుంచి రాజ్యసభకు కృష్ణయ్య

image

మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి కృష్ణయ్య, హరియాణా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లను ఖరారు చేసింది. బీసీ ఉద్యమ నేత కృష్ణయ్య ఇటీవల వైసీపీకి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ ఆయనకు మరోసారి అవకాశం కల్పించింది.

News December 9, 2024

గ్రూప్-2 పరీక్ష వాయిదాకు హైకోర్టులో పిటిషన్

image

TG: గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనున్నట్లు TGPSC ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 16వ తేదీన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ కూడా ఉండటంతో గ్రూప్-2ను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.