News October 22, 2024
అడవి బిడ్డల ఉద్యమ గర్జన ‘కొమురం భీం’
జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాం సర్కారుపై భీకరంగా పోరాడిన గోండు బెబ్బులి కొమురం భీం జయంతి నేడు. ఆసిఫాబాద్(D)లోని ఆదివాసీలను పీడిస్తున్న నిజాం సర్కార్‌కు ఎదురొడ్డి నిలబడ్డాడు. గెరిల్లా తరహా పోరాటాలకు ఆదివాసీలను సిద్ధం చేసి నిజాంకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. అయితే సైన్యం తూటాలకు భీం నేలకొరిగాడు. కానీ ఆయన రగిల్చిన పోరాటం ప్రభుత్వంలో కదలిక తెచ్చింది. అడవి బిడ్డలకు ప్రత్యేక హక్కులు కల్పించింది.
Similar News
News November 3, 2024
PUSHPA-2: మిగిలింది సాంగ్ ఒక్కటే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ‘పుష్ప-2’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్రం ముగింపు దశకు చేరుకుందని, కేవలం స్పెషల్ సాంగ్ చిత్రీకరణ మిగిలి ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో శ్రద్ధా కపూర్‌తో పాటు శ్రీలీల కూడా కనిపించనున్నారని, ఈ వారంలోనే షూటింగ్ జరుగుతుందని సమాచారం.
News November 3, 2024
టర్నింగ్ పిచ్‌లే మనకు శత్రువులు: హర్భజన్
భారత్‌పై టెస్ట్ సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ టీమ్‌ను మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభినందించారు. భారత జట్టుకు టర్నింగ్ పిచ్‌లే శత్రువులుగా మారుతున్నాయని అన్నారు. ‘టీమ్‌ఇండియా మెరుగైన పిచ్‌లపై ఆడాలని చాలా ఏళ్ల నుంచి చెబుతున్నా. ఈ టర్నింగ్ పిచ్‌లు ప్రతి బ్యాటర్‌ను చాలా సాధారణంగా కనిపించేలా చేస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు.
News November 3, 2024
పవన్ కళ్యాణ్ నిర్ణయంపై బిహార్‌లో చర్చ
సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనను బిహార్ బీజేపీ నేతలు స్వాగతించారు. బిహార్‌లో కూడా ఈ తరహా వింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి నీరజ్ బాబు పేర్కొన్నారు. అయితే ఇది క్షేత్రస్థాయి పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్న ప్రయత్నాలని, వీరందరూ నకిలీ సనాతనీయులని RJD నేత మృత్యుంజయ్ తివారీ విమర్శించారు.