News April 25, 2024
రూ.3.99 కోట్ల కారు 325కి.మీ స్పీడ్తో వెళ్తుంది

బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ ‘వాంటేజ్’ పేరుతో కొత్త మోడల్ స్పోర్ట్స్ కారును విడుదల చేసింది. దీని ధరను రూ.3.99 కోట్లు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ మోడల్ టాప్ స్పీడ్ గంటకు 325కి.మీ కాగా.. 0-96కి.మీ వేగాన్ని కేవలం 3.4 సెకన్లలోనే ఈ కారు అందుకుంటుందని సంస్థ వెల్లడించింది. ఇందులో వెట్, స్పోర్ట్, స్పోర్ట్స్ ప్లస్, ట్రాక్, ఇండివిడ్యువల్ డ్రైవ్ మోడ్లు ఉన్నాయి.
Similar News
News December 25, 2025
టుడే టాప్ స్టోరీస్

*20లక్షల ఉద్యోగాల కల్పనకే మొదటి ప్రాధాన్యం: CM CBN
*రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ శిక్షణలో దేశంలోనే AP టాప్
*వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2/3 మెజార్టీతో గెలుస్తుంది: CM రేవంత్
*2028లోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారు: KTR
*ఆరావళి పర్వతాల మైనింగ్పై వెనక్కి తగ్గిన కేంద్రం
*ISRO సరికొత్త చరిత్ర.. కక్ష్యలోకి 6,100కిలోల బరువైన బ్లూబర్డ్ శాటిలైట్
News December 25, 2025
PHOTO GALLERY: క్రిస్మస్ సందడి

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందడి నెలకొంది. రేపు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆసియాలోనే అతిపెద్ద చర్చిల్లో ఒకటైన మెదక్ చర్చి విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్ తదితర నగరాల్లో చర్చిలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇటు క్రైస్తవులు తమ ఇళ్లను కలర్ఫుల్ లైట్లతో డెకరేట్ చేశారు. క్రిస్మస్ గిఫ్ట్స్ కొనుగోళ్లతో మార్కెట్లూ సందడిగా మారాయి.
News December 25, 2025
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్

TG: రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29న 10.30amకు మొదలవుతాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్నిరోజులు సమావేశాలు జరగాలనేది BAC భేటీలో నిర్ణయించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ జరిగే ఆస్కారముంది. అలాగే MPTC, ZPTC ఎన్నికలు, BCలకు 42% రిజర్వేషన్ల సాధనకు కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి తేవాలనే దానిపై డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది.


