News April 25, 2024

రూ.3.99 కోట్ల కారు 325కి.మీ స్పీడ్‌తో వెళ్తుంది

image

బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ ‘వాంటేజ్’ పేరుతో కొత్త మోడల్ స్పోర్ట్స్ కారును విడుదల చేసింది. దీని ధరను రూ.3.99 కోట్లు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ మోడల్ టాప్ స్పీడ్ గంటకు 325కి.మీ కాగా.. 0-96కి.మీ వేగాన్ని కేవలం 3.4 సెకన్లలోనే ఈ కారు అందుకుంటుందని సంస్థ వెల్లడించింది. ఇందులో వెట్, స్పోర్ట్, స్పోర్ట్స్ ప్లస్, ట్రాక్, ఇండివిడ్యువల్ డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి.

Similar News

News January 25, 2026

జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఈ జాగ్రత్తలు

image

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. క్లోరిన్‌ కలిపిన నీటిలో స్విమ్ చేసే ముందు మంచినీళ్లతో తలస్నానం చేసి క్యాప్‌ పెట్టుకోవాలి. స్విమ్మింగ్ తర్వాత మంచి నీళ్లతో తలస్నానం చేయాలి. ఎండలోకి వెళ్లే ప్రతిసారీ సన్‌స్ర్కీన్‌ హెయిర్‌ స్ర్పే వాడాలి. తలకు మరీ వేడి/ చల్లని గాలి తరచూ తగలకుండా స్కార్ఫ్‌/ క్యాప్‌ పెట్టుకోవాలి. వీటితో పాటు పోషకాహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

News January 25, 2026

ఇవాళ నాన్ వెజ్ తినకండి! ఎందుకంటే..

image

వారంలో కొన్ని రోజులు కొందరు దేవుళ్ల పేరిట నియమాలు పాటించి సండే ఏ రూల్ పెట్టుకోం. కానీ లోకానికి వెలుగునిచ్చే ఆదిత్యుడి రోజైన ఆదివారం మాంసం జోలికి పోకూడదట. సూర్యాష్టక శ్లోకం ‘స్త్రీ తైల మధు మాంసాని యే త్యజంతి రవేర్దినే| న వ్యాధి శోక దారిద్య్రం సూర్యలోక స గచ్ఛతి’ ప్రకారం.. ఆదివారం స్త్రీ సాంగత్యం, తల నూనె, మద్యం, మాంసం తాకలేదంటే దారిద్ర్య విముక్తి, సూర్యలోక ప్రాప్తి. ఈరోజు సూర్య జయంతి-రథ సప్తమి.

News January 25, 2026

పశువుల్లో పాల ఉత్పత్తిని మరింత పెంచే గడ్డి

image

పశువుల్లో పాల ఉత్పత్తి పెరిగేందుకు చాలా మంది పాడి రైతులు సూపర్ నేపియర్ పశుగ్రాసం వాడుతున్నారు. ఇప్పుడు దీన్ని మించి అధిక ప్రొటీన్ శాతం కలిగి, పాల దిగుబడిని మరింత పెంచే ‘4G బుల్లెట్ సూపర్ నేపియర్’ పశుగ్రాసం అందుబాటులోకి వచ్చింది. నేపియర్‌తో పోలిస్తే ఇది చాలా మృదువుగా, 10-13 అడుగుల ఎత్తు పెరిగి, ఎకరాకు 200 టన్నుల దిగుబడినిస్తుంది. దీన్ని ఎలా సాగు చేయాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.