News December 18, 2024
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. దర్శనం కోసం 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరస్వామిని 63,598 మంది దర్శించుకున్నారు. వీరిలో శ్రీవారికి 20,102 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.59 కోట్లు వచ్చినట్లు TTD ప్రకటించింది.
Similar News
News January 25, 2025
టీమ్ ఇండియాకు మరో షాక్? స్టార్ ఆల్‌రౌండర్‌కి గాయం?
ఓపెనర్ అభిషేక్ శర్మ కాలి గాయంతో బాధపడుతున్నట్లు వస్తున్న వార్తలు అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తుండగా తాజాగా మరో షాక్ తగిలింది. తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో సిరీస్‌కు దూరమయ్యారు. రింకూ సింగ్ కూడా గాయపడటంతో నేటి, తర్వాతి మ్యాచులు ఆడటం లేదు. వారికి బ్యాకప్‌గా శివమ్ దూబే, రమణ్‌దీప్ సింగ్‌ను టీమ్ ఇండియా జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
News January 25, 2025
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డా: రష్మిక
సినిమాల్లో సక్సెస్ అయ్యేందుకు కుటుంబానికి సమయం కేటాయించడంలో రాజీ పడినట్లు హీరోయిన్ రష్మిక చెప్పారు. వ్యక్తిగత, వృత్తిపర విషయాలకు ఒకేసారి సమయాన్ని కేటాయించడం అంత సులభం కాదన్నారు. కుటుంబమే తన బలమని, ముఖ్యమైన సమయాల్లో ఫ్యామిలీతోనే గడుపుతానని పేర్కొన్నారు. షూటింగ్స్ వల్ల తనకు ఇష్టమైన చెల్లిని మిస్ అవుతున్నానని పేర్కొన్నారు. కాగా, ఆమె నటించిన ‘ఛావా’ మూవీ FEB 14న రిలీజ్ కానుంది.
News January 25, 2025
VSR రాజీనామాకు ఆమోదం.. బులెటిన్ రిలీజ్
AP: రాజ్యసభ ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి చేసిన రాజీనామాను ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆమోదించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేశారు. VSR రాజీనామాతో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ ఏర్పడింది. కాగా రాజకీయాలకు పూర్తిగా దూరమవుతున్నట్లు నిన్న విజయసాయి ప్రకటించిన సంగతి తెలిసిందే.