News April 28, 2024
రాష్ట్రానికి కాషాయ అగ్ర నేతలు

TG: రాష్ట్రంలో బీజేపీ నేతలు ప్రచారం జోరు పెంచారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 12:30 గంటలకు మహబూబాబాద్ సభల్లో పాల్గొంటారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. మరోవైపు మే1న కేంద్ర హోంమంత్రి అమిత్ షా HYDలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కాగా నేటి నుంచి ఇంటింటికీ బీజేపీ రెండో విడత ప్రచారం ప్రారంభం కానుంది.
Similar News
News November 17, 2025
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: నంద్యాల కలెక్టర్

నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కలెక్టర్‌తో పాటు వివిధ అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
News November 17, 2025
JGTL: సింగిల్ డిజిట్‌కు చేరిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు

జగిత్యాల జిల్లా చలికి వణుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్‌కు చేరింది. గోవిందారంలో 9℃, గొల్లపల్లి 9.9, తిరుమలాపూర్, కథలాపూర్, మన్నెగూడెం 10, మల్లాపూర్, పెగడపల్లి 10.2, రాఘవపేట 10.4, మల్యాల 10.5, ఐలాపూర్ 10.6, మేడిపల్లె, జగ్గాసాగర్ 10.7, నేరెళ్ల 10.9, పూడూర్ 11.1, రాయికల్ 11.2, కోరుట్ల, పొలాస, గోదూరు 11.3, మద్దుట్ల, అల్లీపూర్ 11.5, జగిత్యాల, సారంగపూర్లో 11.6℃గా నమోదైంది.
News November 17, 2025
సౌదీ ప్రమాదంలో భారతీయులు చనిపోవడం బాధాకరం: మోదీ

సౌదీ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మదీనాలో జరిగిన ఈ ఘటనలో భారత పౌరులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం & జెడ్డాలోని కాన్సులేట్ సాధ్యమైనంత సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. సౌదీ అధికారులతో సమీక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.


