News April 28, 2024

రాష్ట్రానికి కాషాయ అగ్ర నేతలు

image

TG: రాష్ట్రంలో బీజేపీ నేతలు ప్రచారం జోరు పెంచారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 12:30 గంటలకు మహబూబాబాద్ సభల్లో పాల్గొంటారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. మరోవైపు మే1న కేంద్ర హోంమంత్రి అమిత్ షా HYDలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కాగా నేటి నుంచి ఇంటింటికీ బీజేపీ రెండో విడత ప్రచారం ప్రారంభం కానుంది.

Similar News

News April 14, 2026

మరోసారి తెలుగు సినిమాలో ఆలియా?

image

అందంతో పాటు విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆలియా భట్. ఆమె తెలుగులో ఇప్పటివరకు ఒక్క సినిమాలోనే(RRR) నటించారు. త్వరలోనే మరో మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. NTR-NEEL మూవీలో ఓ కీలక పాత్రలో నటించేందుకు ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుందని సినీ వర్గాలు తెలిపాయి. ఆలియా ప్రస్తుతం ‘ఆల్ఫా’, ‘లవ్&వార్’ సినిమాల్లో నటిస్తున్నారు.

News April 14, 2026

రేవంత్ చెబుతున్న హైబ్రిడ్ నమూనా ఎక్కడా లేదు: కిషన్ రెడ్డి

image

TG: డీలిమిటేషన్‌తో దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలన్నదే తమ విధానమన్నారు. ‘రేవంత్ చెబుతున్న <<19646674>>హైబ్రిడ్ నమూనా<<>> ఎక్కడా లేదు. TGలో ఆ విధానాన్ని అమలు చేస్తే ఆదిలాబాద్‌కు సీట్లు తగ్గించి HYDకు పెంచుతారా? రాష్ట్ర ఆదాయంలో 70% HYD నుంచే వస్తోంది. అలాంటప్పుడు 70% సీట్లు HYDలోనే ఉండాలా’ అని ప్రెస్‌మీట్‌లో ప్రశ్నించారు.

News April 14, 2026

పోలీసులు వీధి రౌడీల్లా ప్రవర్తించడమేంటి: జగన్

image

AP: SM కేసులలో పోలీసులు వీధి రౌడీల్లా అర్ధరాత్రి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడమేంటని YCP చీఫ్ జగన్‌ మండిపడ్డారు. ‘TDP నేతల మెప్పుకోసం కొందరు పోలీసులు రెచ్చిపోతున్నారు. వారిపై హైకోర్టులో కేసులు వేసి బాధితులకు న్యాయం చేస్తాం’ అని పేర్కొన్నారు. వేమూరు, రేపల్లె YCP నేతలు ఇవాళ జగన్‌ను కలిశారు. GOVT, TDP తీరుపై SMలో విమర్శించినందుకు పోలీసులు కొట్టారని పార్టీ నేతలు తనీష్, కృష్ణార్జునరెడ్డి తెలిపారు.