News November 2, 2024
అమెరికన్లలో మళ్లీ అవే భయాలు!

పెన్సిల్వేనియాలో ఓట్ల అవకతవకలపై ఆరోపణలు చేయడం ద్వారా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్ని డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సవాల్ చేయవచ్చనే ఆందోళనలు ఊపందుకున్నాయి. గత ఎన్నికల ఫలితాల్ని సవాల్ చేస్తూ జనవరి 6, 2021న తన అనుచరులతో క్యాపిటల్ భవనం వద్ద ట్రంప్ చేసిన ఆందోళనలను తాజా ఆరోపణలు గుర్తు చేస్తున్నాయని అంటున్నారు. అయితే, ఓటర్ ఫ్రాడ్‌పై ఆధారాలు లేవని ఎన్నికల అధికారులు తేల్చారు.
Similar News
News November 17, 2025
బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై ‘బ్లూ బుక్’: మోదీ

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఇంజినీర్లు తమ అనుభవాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలని PM మోదీ సూచించారు. తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు నుంచి నేర్చుకున్న విషయాలను ‘బ్లూ బుక్’లా సంకలనం చేయాలని చెప్పారు. ఏం చేశారనేదే కాకుండా ఒక్కో నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయం భవిష్యత్ టీమ్స్‌కు తెలుస్తుందని తెలిపారు. సూరత్‌లోని రైల్వే కారిడార్‌లో ఇంజినీర్లు, కార్మికులతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు.
News November 17, 2025
ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఈనెల 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
News November 17, 2025
ఢిల్లీ పేలుడు: ఏమిటీ డెడ్ డ్రాప్?

ఢిల్లీ పేలుడు కేసు నిందితులు ‘డెడ్ డ్రాప్’ ఈ-మెయిల్ విధానం వాడినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఒకే మెయిల్ IDతో రహస్యంగా సమాచార మార్పిడి చేసుకోవడమే ‘డెడ్-డ్రాప్’ పద్ధతి. సమాచారాన్ని డ్రాఫ్ట్‌లో సేవ్ చేస్తే, దాన్ని అవతలి వ్యక్తి చూస్తారు. తర్వాత అప్డేట్ లేదా డిలీట్ చేస్తారు. ఇందులో మెయిల్ పంపడం, రిసీవ్ చేసుకోవడమనేదే ఉండదు. దీన్ని గుర్తించడం చాలా కష్టమని అధికారులు అంటున్నారు.


