News August 21, 2024
పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారు
TG: పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రచురించనుంది. ఓటరు జాబితాపై SEP 7 నుంచి 13 వరకు అభ్యంతరాలు స్వీకరించనుంది. 9, 10న రాజకీయ పార్టీల సూచనలు స్వీకరించనుంది. అదే నెల 21న వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను ప్రచురించనుంది. కాగా ఓటరు జాబితా తయారీపై ఈ నెల 29న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.
Similar News
News September 19, 2024
ఆ విషయంలో మాది కూడా కాంగ్రెస్-ఎన్సీ వైఖరే: పాక్ మంత్రి
JKలో ఆర్టికల్ 370 పునరుద్ధరణ విషయంలో తాము కూడా కాంగ్రెస్-ఎన్సీ వైఖరితోనే ఉన్నామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా కీలక వ్యాఖ్యలు చేశారు. JKలో కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని, ఆర్టికల్ 370, 35A పునరుద్ధరణలో వారిది, తమది ఒకే వైఖరి అని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ ఎక్కడా ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తామని చెప్పలేదు. NC మాత్రం అమలు చేస్తామంటూ ఎన్నికల్లో ప్రచారం చేస్తుండడం గమనార్హం.
News September 19, 2024
ALERT: గోధుమ పిండి వాడుతున్నారా?
ఉత్తర్‌ప్రదేశ్‌లో వందల కిలోల నకిలీ గోధుమ పిండిని అధికారులు గుర్తించడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఇంట్లోనే నకిలీ పిండిని గుర్తించవచ్చు. మొదట ప్లేట్‌లో కొద్దిగా పిండి తీసుకోండి > అందులో నిమ్మరసం వేయండి.. నీటి బుడగలు వస్తే అది కల్తీది. గ్లాసు నీటిలో పిండిని వేసి కలపండి. పిండి నీటిపై తేలితే అది స్వచ్ఛమైనది కాదని అర్థం. కాస్త పిండిని నోటిలో వేసుకోండి చేదుగా ఉంటే అది కల్తీ అయినట్లే.
News September 19, 2024
యువ CA మృతిపై కేంద్రం విచారణ
ఛార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్(26) <<14129191>>మృతిపై <<>>కేంద్రం విచారణ మొదలుపెట్టింది. తన కూతురు ఆఫీస్‌లో అదనపు పని ఒత్తిడి వల్లే చనిపోయిందని ఆమె తల్లి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పని ప్రదేశాల్లో అసురక్షిత వాతావరణం, శ్రమ దోపిడీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో BJP నేత రాజీవ్ చంద్రశేఖర్ కేంద్రం జోక్యాన్ని డిమాండ్ చేయడంతో కేంద్ర కార్మికశాఖ స్పందించి విచారణకు ఆదేశించింది.