News April 24, 2024

రెండో దశ ఎన్నికలు.. స్వల్పంగా పెరిగిన మహిళా అభ్యర్థులు

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ ఈ నెల 26న జరగనుంది. 13 రాష్ట్రాల్లోని 89 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశతో పోలిస్తే సెకండ్ ఫేజ్‌లో పోటీ చేసే మహిళా అభ్యర్థులు కాస్త పెరిగారు. తొలి దశలో 102 స్థానాలకు 1,625 మంది పోటీ చేయగా 134(8.2%) మంది మహిళలున్నారు. ఈసారి 1198 మంది బరిలో ఉండగా వీరిలో 103(8.6%) మంది మహిళలు పోటీలో నిలిచారు.<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News March 3, 2026

IIT బెనారస్‌లో ఉద్యోగాలు

image

<>ఐఐటీ <<>>బెనారస్ హిందూ యూనివర్సిటీ 5 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల వారు మార్చి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BTech/MTech/PhD, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నోడల్ ఆఫీసర్‌కు నెలకు రూ.లక్ష, రీసెర్చ్ ఇంజినీర్‌కు రూ.75K, డిజైన్ ఇంజినీర్‌కు రూ.55K, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.45K చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.iitbhu.ac.in

News March 3, 2026

ఇరాన్‌లో భూకంపం.. అణుకేంద్రాల దగ్గర అలజడి

image

ఇరాన్‌లోని గెరాష్ నగర సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10km లోతులో చోటుచేసుకున్న ఈ ప్రకంపనలు సహజసిద్ధమైనవేనని USGS తెలిపింది. అయితే అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ భూకంపం రావడం సర్వత్రా చర్చకు దారితీసింది. గెరాష్‌కు సమీపంలో ఉన్న బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం, గ్చైన్ యురేనియం గనులకు ఎలాంటి నష్టం జరగలేదని సమాచారం. యుద్ధం మధ్యలో ఈ భూకంపం భయాందోళనలను రేకెత్తించింది.

News March 3, 2026

అభివృద్ధి చెందాం.. కానీ, శాంతిని మర్చిపోయాం!

image

టెక్నాలజీ పెరిగింది. నాగరికత శిఖరాగ్రానికి చేరింది. దౌత్యం గొప్పతనాన్ని చరిత్ర చాటిచెప్పింది. మనం సృష్టించిన ఆయుధాలు మనల్నే మింగేసేంత శక్తిమంతమైనవని తెలిసినా.. రక్తపాతాలు ఆగడం లేదు. నాయకుల ఈగోలు, ఆధిపత్య పోరాటాలు మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. దేశాల ఉనికిని కాపాడాల్సింది పోయి, యుద్ధాలతో వినాశనాన్ని కొనితెచ్చుకోవడం విషాదం. హింసను ఆపి మనిషిని ప్రేమించే స్పృహ పెరగాల్సిన సమయం ఇది.