News May 1, 2024

రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పైనే: CBN

image

AP: కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం డీఎస్సీ, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేస్తానని చంద్రబాబు చెప్పారు. ‘మొన్నటి వరకు బలవంతంగా సెటిల్మెంట్లు చేసి ఆస్తులు రాయించుకున్నారు. ఇప్పుడు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకువచ్చారు. మీ భూమిపైన జగన్ ఫొటో ఎందుకు? మీకు జగన్ తాత భూమి ఇచ్చాడా? రేపటి నుంచి మీ భూమి.. మీది కాదు. మనందరం బానిసలుగా ఉండాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News April 5, 2026

ఎలక్షన్స్.. రూ.651 కోట్లు సీజ్: EC

image

బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళం, పుదుచ్చేరి ఎన్నికలతోపాటు 6 రాష్ట్రాల్లో బై ఎలక్షన్స్ జరిగే నియోజకవర్గాలపై ఈసీ పటిష్ఠ నిఘా ఏర్పాటుచేసింది. ఇప్పటి వరకు రూ.651 కోట్ల విలువైన లిక్కర్, డ్రగ్స్, డబ్బు, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు ప్రకటించింది. 5,173 ఫ్లయింగ్ స్క్వాడ్స్ నిత్యం తనిఖీలు చేస్తున్నట్లు తెలిపింది. సాధారణ పౌరులకు వేధింపులు, అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

News April 5, 2026

SRH బ్యాటింగ్.. జట్టులో మార్పు

image

SRHతో మ్యాచులో LSG టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సలీల్ స్థానంలో లివింగ్‌స్టోన్, పైన్ స్థానంలో హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చారు.

SRH: అభిషేక్, హెడ్, కిషన్ (C), క్లాసెన్, అనికేత్, నితీశ్, లివింగ్‌స్టోన్, హర్షల్ పటేల్, హర్ష్ దూబే, ఉనద్కత్, శివాంగ్ కుమార్.
LSG: మార్ష్, పంత్ (C), మార్క్రమ్, పూరన్, సమద్, ముకుల్ చౌదరి, సిద్దార్థ్, అవేశ్ ఖాన్, షమీ, దిగ్వేశ్, ప్రిన్స్.

News April 5, 2026

షిన్రిన్-యోకు: స్ట్రెస్‌ను దూరం చేసే జపనీస్ టెక్నిక్

image

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కామన్ అయిపోయిన స్ట్రెస్‌ను దూరం చేసుకునేందుకు జపాన్ వాసులు ‘షిన్రిన్-యోకు’ అనే సహజ ప్రక్రియను అనుసరిస్తున్నారు. షిన్రిన్-యోకు అంటే ప్రకృతి ఒడిలో నిమగ్నమవ్వడం. పచ్చని చెట్లు, పక్షుల కిలకిలారావాలు, మట్టి వాసనలను ఆస్వాదిస్తూ గడపడమే ఈ పద్ధతిలోని కీలకాంశం. ఇలా ప్రకృతితో మమేకమైతే మానసిక ఆందోళనలు దూరమై శారీరకంగా, మానసిక‌ంగా ప్రశాంతత లభిస్తుందని జపాన్ వాసుల విశ్వాసం.