News July 17, 2024

గ్రాడ్యుయేట్లకు ప్రతి నెలా రూ.10వేల భత్యం ప్రకటించిన షిండే ప్రభుత్వం

image

మహారాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం కొత్త పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా 12వ తరగతి పాసైన విద్యార్థులకు ప్రతి నెలా రూ.6000, డిప్లొమా చేసిన వారికి రూ.8వేలు, గ్రాడ్యుయేట్స్‌కు రూ.10వేల భత్యం ఇవ్వనున్నట్లు షిండే ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులకు ఉపాధిని మెరుగుపరిచేందుకు నైపుణ్య శిక్షణలో భాగంగా ఏడాది పాటు ఈ భత్యం చెల్లించనున్నారు. కాగా రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News February 22, 2026

పరీక్షల వేళ విద్యార్థులు ఇలా చేస్తే మంచిది!

image

APలో రేపట్నుంచి ఇంటర్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ టైమ్‌లో విద్యార్థులు ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఇవాళ రాత్రి తగినంత నిద్రపోయి, రేపు ఉదయం తేలికపాటి అల్పాహారం తీసుకొని పరీక్షా కేంద్రానికి ముందుగానే బయల్దేరాలి. హాల్ టికెట్, పెన్నులు వంటి అవసరమైన వస్తువులను పడుకొనే ముందే రెడీ చేసుకోవాలి. పరీక్షలో ఏదైనా ప్రశ్న కష్టంగా అనిపిస్తే ఆందోళన చెందకుండా మిగిలిన వాటిపై దృష్టి పెట్టాలి. share it.

News February 22, 2026

రేపటి నుంచి ఐపీఓల హవా

image

దేశీయ స్టాక్ మార్కెట్లలో రేపటి నుంచి వారం పాటు ఐపీఓల హవా కొనసాగనుంది. తొమ్మిది ఐపీఓలు పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులోకి రానున్నాయి. వీటితో ₹4,405 కోట్ల పెట్టుబడి రానుందని అంచనా. రేపు ఒక్కరోజే ఐదు ఐపీఓలు ఓపెన్ అవుతాయి. వీటిలో ₹3,100 కోట్లతో క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ బిగ్గెస్ట్ ఐపీఓగా ఉంది. మెయిన్‌బోర్డ్ సెగ్మెంట్‌లో నాలుగు, SME సెగ్మెంట్‌లో ఐదు ఐపీఓలు లాంచ్ అవుతున్నాయి.

News February 22, 2026

కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్!

image

TG: రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో ఎండలు మండిపోతుండగా మరికొన్ని జిల్లాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాబోయే 3-4 గంటల్లో ఆసిఫాబాద్, మహబూబాబాద్, వికారాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, భద్రాద్రి జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో రాత్రివేళ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు.