News July 17, 2024

గ్రాడ్యుయేట్లకు ప్రతి నెలా రూ.10వేల భత్యం ప్రకటించిన షిండే ప్రభుత్వం

image

మహారాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం కొత్త పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా 12వ తరగతి పాసైన విద్యార్థులకు ప్రతి నెలా రూ.6000, డిప్లొమా చేసిన వారికి రూ.8వేలు, గ్రాడ్యుయేట్స్‌కు రూ.10వేల భత్యం ఇవ్వనున్నట్లు షిండే ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులకు ఉపాధిని మెరుగుపరిచేందుకు నైపుణ్య శిక్షణలో భాగంగా ఏడాది పాటు ఈ భత్యం చెల్లించనున్నారు. కాగా రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News December 10, 2024

శబరిమల వెళ్లే మహిళలకు గుడ్‌న్యూస్

image

శబరిమల వెళ్లే మహిళల భద్రత పట్ల కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంబా బేస్‌లో ప్రత్యేక వసతి సదుపాయాన్ని కల్పించింది. ఈ వసతి గృహంలో 50మంది మహిళలు విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేసి సోమవారం ప్రారంభించింది. అయ్యప్ప మాలధారులతో వచ్చే మహిళలు తమవారు తిరిగొచ్చే వరకు పంపా బేస్, హిల్ టాప్ వద్ద వాహనాల్లోనే ఎదురు చూడాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో మహిళలకు ఆ కష్టాలు తీరనున్నాయి.

News December 10, 2024

మీడియా సంస్థలపై జగన్ రూ.100 కోట్ల పరువు నష్టం దావా

image

AP: సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో తనపై అవాస్తవాలు ప్రచురించాయంటూ పలు మీడియా సంస్థలపై రూ.100 కోట్లకు మాజీ సీఎం జగన్ పరువు నష్టం దావా వేశారు. వెంటనే ఆ కథనాలు తొలగించి బేషరతుగా క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయమూర్తి ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు నోటీసులిచ్చారు. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.

News December 10, 2024

మంత్రివర్గంలోకి నాగబాబు.. అంబటి సెటైర్

image

AP: నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ‘ప్రభుత్వం అంటే మల్టీ స్టారర్ మూవీ అనుకుంటున్నారు.. పాపం’ అని Xలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, నాగబాబును ట్యాగ్ చేశారు.