News March 22, 2024
షిప్ లేటయింది.. గుట్టు రట్టయింది: TDP

AP: విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టుబడటంపై TDP ట్వీట్ చేసింది. ‘ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపు పోలీసులతో డ్రగ్స్ దింపేసి, బ్రెజిల్ మాఫియా దగ్గర డబ్బులు కొట్టేద్దామని ప్లాన్ వేశాడు. షిప్ వారం లేటుగా వచ్చింది. ఈలోపు ఇంటర్‌పోల్, CBI రంగంలోకి దిగి పట్టేశాయి. జగన్ రెడ్డి పోలీసులని, అధికారులను పంపించి CBI విచారణను అడ్డుకున్నారు. కానీ CBI నట్లు బిగించి సరుకు పట్టేసింది’ అని ఆరోపించింది.
Similar News
News February 12, 2025
అధికారులు ప్రతినెలా 3-4 జిల్లాల్లో తిరగాలి: సీఎం

AP: గ్రూప్-1 అధికారులతో సహా ప్రతి ఒక్కరూ ఏప్రిల్ నుంచి ప్రతి నెలా 3-4 జిల్లాల్లో పర్యటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉన్నతాధికారులు గ్రామాలకు వెళ్లే అంశంపై ప్రణాళిక రూపొందిస్తామన్నారు. రెవెన్యూ, పోలీస్, విద్య, వైద్య శాఖలకు సంబంధించి ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని పరిష్కరించాలని సూచించారు. ఒక్కొక్క ఉన్నతాధికారి ఒక్కో జిల్లాను దత్తత తీసుకోవాలని పేర్కొన్నారు.
News February 12, 2025
మంచి మాట – పద్యబాట

లావుగలవానికంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ!
భావం: శారీరకంగా బలంగా ఉన్నవాడికంటే తెలివితేటలు ఉన్నవాడే బలవంతుడు. పర్వతమంత ఆకారంలో ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా మచ్చిక చేసుకుని దానిమీదకు ఎక్కగలడు.
News February 12, 2025
నన్ను రాజకీయాల్లోకి లాగకండి: విశ్వక్

తనను, తన సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దని విశ్వక్‌సేన్ నెటిజన్లను కోరారు. తాను మిడిల్ ఫింగర్ చూపిస్తున్న పోస్టర్ నెల రోజుల క్రితం విడుదలైందని, రెడ్ సూట్ ఫొటో కూడా ఇప్పటిది కాదని చెప్పారు. ‘ప్రతీసారి తగ్గను. కానీ నిన్న మనస్ఫూర్తిగా <<15423495>>సారీ<<>> చెప్పాను. అతిగా ఆలోచించొద్దు. శాంతంగా ఉండండి. అసభ్య పదజాలం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. లైలాను బాయ్‌కాట్ చేయాలన్న ఆలోచనను బాయ్‌కాట్ చేయండి’ అని X పోస్ట్ పెట్టారు.