News September 24, 2024
తరిగిపోతున్న అమెజాన్ ఫారెస్ట్!

అతిపెద్ద రెయిన్‌ఫారెస్ట్ ‘అమెజాన్’ తరిగిపోతోంది. గత నాలుగు దశాబ్దాల్లో అటవీ నిర్మూలనతో ఏకంగా జర్మనీ & ఫ్రాన్స్‌ల పరిమాణమంత అడవిని కోల్పోయిందని ఓ అధ్యయనం తెలిపింది. ప్రధానంగా మైనింగ్ & వ్యవసాయం కోసం 1985- 2023 మధ్య అటవీ నిర్మూలన జరిగింది. 88 మిలియన్ హెక్టార్ల అడవిని కోల్పోవడం ఆందోళనకరం. అమెజాన్‌లో వృక్షసంపద కోల్పోతే అనేక దక్షిణ అమెరికా దేశాల్లో కరవు ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News November 8, 2025
ఇవాళ్టి బంగారం, వెండి ధరలిలా

రెండో శనివారం సందర్భంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,020గా ఉంది. అటు వారం రోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ.980 తగ్గడం విశేషం. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,11,850గా ఉంది. అటు కేజీ వెండి ధర రూ. 1,65,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 8, 2025
‘కృష్ణ పక్షం’ అంటే ఏంటి?

క్యాలెండర్లో కొన్ని తిథుల ముందుండే కృష్ణ పక్షం అంటే ఏంటో తెలుసుకుందాం. కృష్ణ పక్షం అంటే.. ప్రతి నెలా పౌర్ణమి తర్వాత, అమావాస్య వరకు ఉండే 15 రోజుల కాలం. ఈ పక్షంలో చంద్రుడి వెన్నెల క్రమంగా తగ్గుతుంది. చంద్రుడు అలా క్షీణిస్తూ పోతాడు కాబట్టి దీన్ని క్షీణ చంద్ర పక్షమని, చీకటి పక్షమని కూడా అంటారు. చీకటి, నలుపును సూచించే ‘కృష్ణ’ను జోడించి కృష్ణ పక్షం అనే పేరొచ్చింది. బహుళ పక్షం అని కూడా వ్యవహరిస్తారు.
News November 8, 2025
ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో 64 ఉద్యోగాలు

ఎయిమ్స్ బిలాస్‌పుర్ 64 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 12వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎమ్మెస్సీ, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎంసీహెచ్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.1,180, SC,STలకు రూ.500. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.aiimsbilaspur.edu.in


