News December 19, 2024
కొత్త రెవెన్యూ చట్టం ప్రకారమే భూ సమస్యలకు పరిష్కారం

TG: ప్రభుత్వం త్వరలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానుందని, అప్పటివరకూ భూ సంబంధించిన ఆర్డర్లు జారీ చేయవద్దని జిల్లా కలెక్టర్లను భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ ఆదేశించారు. కొత్త చట్టం ప్రకారమే భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని సూచించారు. తదుపరి ఆదేశాలను జారీ చేసే వరకూ ఎలాంటి ఆర్డర్లు ఇవ్వొద్దని, ఒకవేళ ఎవరైనా ఇచ్చినా అవి చెల్లుబాటు కావని స్పష్టం చేశారు.
Similar News
News December 11, 2025
పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 700+ సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 250+ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇండిపెండెంట్లు 150+ స్థానాల్లో గెలవగా.. BJP బలపరిచిన అభ్యర్థులు 50+ స్థానాల్లో విజయం సాధించారు.
News December 11, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ ఉదయం బంగారం <<18528737>>ధరలు<<>> కాస్త తగ్గగా.. గంటల వ్యవధిలోనే పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ప్రస్తుతం రూ.440 పెరిగి రూ.1,30,750కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.400 ఎగబాకి రూ.1,19,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,09,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 11, 2025
ఈ నూనెలతో మేకప్ తొలగిద్దాం..

మేకప్ వేసుకోవడంతో పాటు దాన్ని తియ్యడంలో కూడా జాగ్రత్తలు పాటిస్తేనే చర్మ ఆరోగ్యం బావుంటుందంటున్నారు నిపుణులు. వాటర్ ఫ్రూఫ్ మేకప్ తొలగించడానికి ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల సులువుగా శుభ్ర పడటంతో పాటు చర్మం కూడా తాజాగా ఉంటుంది. కీరదోస రసంలో చెంచా గులాబీ నూనె కలిపి ముఖానికి రాసుకున్నా మేకప్ పోతుంది. ఇది సహజ క్లెన్సర్ గానూ పని చేస్తుంది. తేనె, బాదం నూనె కలిపి మేకప్ తీసినా చర్మం పాడవకుండా ఉంటుంది.


