News December 19, 2024
కొత్త రెవెన్యూ చట్టం ప్రకారమే భూ సమస్యలకు పరిష్కారం
TG: ప్రభుత్వం త్వరలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానుందని, అప్పటివరకూ భూ సంబంధించిన ఆర్డర్లు జారీ చేయవద్దని జిల్లా కలెక్టర్లను భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ ఆదేశించారు. కొత్త చట్టం ప్రకారమే భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని సూచించారు. తదుపరి ఆదేశాలను జారీ చేసే వరకూ ఎలాంటి ఆర్డర్లు ఇవ్వొద్దని, ఒకవేళ ఎవరైనా ఇచ్చినా అవి చెల్లుబాటు కావని స్పష్టం చేశారు.
Similar News
News January 22, 2025
BJPకి కటీఫ్ చెప్పిన నితీశ్.. ట్విస్ట్ ఏంటంటే!
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీజేపీకి షాకిచ్చారు. మణిపుర్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. అక్కడ ఆ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే 5 స్థానాలున్న NPP సైతం మద్దతు వెనక్కి తీసుకుంది. 60 స్థానాలున్న మణిపుర్ అసెంబ్లీలో ప్రస్తుతం NDA బలం 45కు తగ్గింది. ఇక్కడ బీజేపీకి సొంతంగా 37 సీట్లు ఉన్నాయి. అధికారానికి 31 చాలు.
News January 22, 2025
నోటిఫికేషన్ వచ్చేసింది..
UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) నోటిఫికేషన్ రిలీజైంది. 979 పోస్టుల భర్తీకి జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మే 25న ప్రిలిమ్స్ జరగనుంది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు, 21-32 ఏళ్ల వయసు ఉన్నవారు దీనికి అర్హులు. దరఖాస్తు చేసుకునేందుకు సైట్: <
News January 22, 2025
అమరావతికి హడ్కో రూ.11వేల కోట్ల నిధులు: మంత్రి నారాయణ
AP: రాజధాని అమరావతి నిర్మాణం కోసం హడ్కో రూ.11వేల కోట్ల నిధులు విడుదల చేసేందుకు అంగీకరించిందని మంత్రి నారాయణ తెలిపారు. ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. హడ్కో ద్వారా రూ.11వేల కోట్ల రుణం పొందేందుకు చర్చలు జరిపామన్నారు. దీంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని నారాయణ పేర్కొన్నారు.