News January 30, 2025
క్రమబద్ధీకరణ ప్రక్రియ ఇలా..

AP: ఆక్రమిత ప్రభుత్వ స్థలాల్లో 2019 OCT 15 కంటే ముందు ఇళ్లు కట్టుకున్న వారు ఈ ఏడాది DEC 31 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై అధికారులు విచారణ చేసి MRO/RDO/మున్సిపల్ కమిషనర్లకు నివేదికలు ఇస్తారు. వీటిని సబ్ డివిజనల్ కమిటీలో చర్చించి తహశీల్దార్ కన్వేయెన్స్ డీడ్‌ల రూపంలో క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఇస్తారు. రెండేళ్ల తర్వాత లబ్ధిదారులకు ఆ భూములపై శాశ్వత హక్కులు వస్తాయి.
Similar News
News February 18, 2025
పుష్ప-2 కలెక్షన్లు ఎంతంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక నటించిన ‘పుష్ప-2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది. గతేడాది DEC 5న రిలీజై ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.1,871 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ అని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. మూవీని సుకుమార్ తెరకెక్కించగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ప్రస్తుతం కొన్ని థియేటర్లతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ ‘పుష్ప-2’ స్ట్రీమింగ్ అవుతోంది.
News February 18, 2025
సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్ వన్‌గా ఉంచుతాం: రేవంత్

TG: దేశంలోనే సైబర్ సేఫ్టీలో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ తెలిపారు. సైబర్ నేరాలకు పరిష్కారాలు కనుగొనడమే లక్ష్యంగా జరుగుతున్న షీల్డ్-2025 సదస్సులో ఆయన మాట్లాడారు. ‘దేశంలో సైబర్ నేరగాళ్లు గత ఏడాది రూ.22,812 కోట్లు దోచుకున్నారు. ఇది మన ఆర్థిక వ్యవస్థ, పౌరులకు పెద్ద ముప్పు. సైబర్ నేరాల నుంచి రక్షించే 1930 సైబర్ హెల్ప్ లైన్ నంబర్‌ను ప్రతి ఒక్కరూ షేర్ చేయాలి’ అని CM కోరారు.
News February 18, 2025
అల్లు అర్జున్ సినిమాలో జాన్వీ కపూర్?

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ చిత్రం దాదాపు ఖరారైనట్లేనని సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే తన నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్‌తోనే అని బన్నీఒక ప్రైవేట్ షోలో చెప్పిన సంగతి తెలిసిందే. కానీ షెడ్యూల్ తదితర కారణాల రీత్యా పుష్ప-2 తర్వాత తన తదుపరి చిత్రం అట్లీతో చేయనున్నారట. ఈ మూవీపై పూర్తి అప్డేట్స్ త్వరలో వచ్చే అవకాశాలున్నాయి.