News December 24, 2024

ఖోఖో ప్రపంచకప్‌కు రంగం సిద్ధం

image

ఇండియా వేదికగా ఖోఖో ప్రపంచకప్ ఆరంభ ఎడిషన్ జనవరి 13 నుంచి 19 వరకు జరగనుంది. మెన్స్, ఉమెన్స్ విభాగంలో జరిగే ఈ టోర్నీలో 24 దేశాలు పాల్గొననున్నాయి. ఒక్కో జట్టులో 16 మంది ప్లేయర్లు ఉంటారు. జనవరి 13న ప్రారంభోత్సవం, 14 నుంచి 16 వరకు లీగ్ మ్యాచ్‌లు, 17, 18వ తేదీల్లో క్వార్టర్స్, సెమీస్ మ్యాచ్‌లు, 19న ఫైనల్ జరగనుంది.

Similar News

News November 20, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.170 తగ్గి రూ.1,24,690కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పతనమై రూ.1,14,300 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 తగ్గి రూ.1,73,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 20, 2025

బొప్పాయి కోత, రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

బొప్పాయిని దూరంగా ఉండే మార్కెట్లకు పంపాలంటే వాటిపై ఆకుపచ్చ రంగు నుంచి 1,2 పసుపు చారలు రాగానే కోయాలి. దగ్గరి మార్కెట్లలో విక్రయించాలంటే కొంచెం మాగిన కాయలను కోయాలి. బొప్పాయిని కోశాక పాలు ఆరేవరకు నీడలో ఉంచాలి. లేకుంటే కాయలపై మచ్చలు పడి నాణ్యత దెబ్బతింటుంది. కాయలకు విడివిడిగా న్యూస్ పేపర్ చుట్టి ప్యాకింగ్ చేయాలి. బొప్పాయి రవాణా చేసే వాహనాల అడుగున, పక్కల వరిగడ్డి పరిస్తే నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది.

News November 20, 2025

కోచింగ్ సెంటర్‌లో ప్రేమ.. విడాకులు!

image

iBOMMA నిర్వాహకుడు రవి వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమీర్‌పేట్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో పరిచయమైన ముస్లిం యువతిని రవి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వారికి ఓ పాప ఉంది. విదేశాల్లో ఉన్న తన అక్క, బావ రూ.కోట్లు సంపాదిస్తుంటే, నీకు డబ్బు సంపాదించడం చేతకావట్లేదని రవి భార్య, అత్త ఎగతాళి చేసేవారని దర్యాప్తులో తేలింది. 2021లో విడాకులు కాగా పాపను భార్య తీసుకెళ్లినట్లు తేలింది.