News December 24, 2024
ఖోఖో ప్రపంచకప్‌కు రంగం సిద్ధం
ఇండియా వేదికగా ఖోఖో ప్రపంచకప్ ఆరంభ ఎడిషన్ జనవరి 13 నుంచి 19 వరకు జరగనుంది. మెన్స్, ఉమెన్స్ విభాగంలో జరిగే ఈ టోర్నీలో 24 దేశాలు పాల్గొననున్నాయి. ఒక్కో జట్టులో 16 మంది ప్లేయర్లు ఉంటారు. జనవరి 13న ప్రారంభోత్సవం, 14 నుంచి 16 వరకు లీగ్ మ్యాచ్‌లు, 17, 18వ తేదీల్లో క్వార్టర్స్, సెమీస్ మ్యాచ్‌లు, 19న ఫైనల్ జరగనుంది.
Similar News
News January 24, 2025
ChatGPT డౌన్.. కోట్లమందిపై ఎఫెక్ట్
OpenAI చాట్‌బాట్ ChatGPT కొన్ని గంటల పాటు డౌన్ అయింది. టెక్నికల్ ఇష్యూ తలెత్తడంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది యూజర్లు ఇబ్బంది పడ్డారు. ఇలాంటి ఔటేజెస్‌ను ట్రాక్ చేసే వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్‌లో ఎర్రర్ రిపోర్టులు సబ్మిట్ చేశారు. దీనిని ధ్రువీకరించిన OpenAI సమస్యను పరిష్కరించింది. ChatGPT మొబైల్ యాప్ బాగానే ఉందని, వెబ్‌సైట్లోనే “bad gateway” సర్వర్ సమస్య తలెత్తినట్టు తెలిసింది.
News January 24, 2025
APలో HCLను విస్తరించాలని లోకేశ్ వినతి
APలో HCLను మరో 10వేల మందికి ఉపాధి కల్పించేలా విస్తరించాలని ఆ సంస్థ సీఈవో కళ్యాణ్‌కుమార్‌ను మంత్రి లోకేశ్ కోరారు. దావోస్ పర్యటనలో భాగంగా జరిగిన భేటీలో ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పాలసీల్లో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ప్రోత్సాహకాలు ప్రకటించామని, ఏపీలో రీలొకేషన్ చేసే పరిశ్రమలు, ఎక్విప్‌మెంట్ ఇంపోర్టుకు 50శాతం రాయితీలు ఇస్తామన్నారు.
News January 24, 2025
పోలీసులకు గురుమూర్తి సవాల్!
TG: భార్య వెంకటమాధవిని అత్యంత క్రూరంగా <<15235940>>చంపిన<<>> గురుమూర్తి పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ‘అవును నేనే చంపా. మీ వద్ద సాక్ష్యాలున్నాయా? నాపై కేసు పెట్టి రిమాండ్ చేయండి. అంతా కోర్టులోనే చూసుకుంటా’ అని సవాల్ విసిరినట్లు తెలుస్తోంది. ఇంట్లో రక్తం మరకలు లేకపోవడం, వాసన కూడా రాకపోవడంతో ‘ముక్కలు’గా నరికిన విషయం నిజమేనా? లేక తమను తప్పుదోవ పట్టిస్తున్నాడా? అని పోలీసులు ఆలోచనలో పడ్డట్లు సమాచారం.