News September 8, 2024
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ‘నేను దేశం తరఫున ఎన్నో ఏళ్లు క్రికెట్ ఆడా. యువకులకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలీ ఇప్పటికే 2సార్లు రిటైర్మెంట్ ప్రకటించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇకపై అలాంటి ప్రయత్నం చేయబోనని ఆయన స్పష్టం చేశారు. అలీ ENG తరఫున 68 టెస్టులు, 138 ODIలు, 92 T20లు, లీగ్లలో 352 మ్యాచ్లు ఆడారు.
Similar News
News January 15, 2026
మృణాల్, ధనుశ్ పెళ్లంటూ ప్రచారం!

తమిళ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోనున్నట్లు మరోసారి ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 14(ప్రేమికుల రోజు)న వీరిద్దరూ వివాహ జీవితంలోకి అడుగుపెడతారని దాని సారాంశం. అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వీరు ఒక్కటి కానున్నారని తెలుస్తోంది. గతంలోనూ వీరు ప్రేమలో ఉన్నారని ప్రచారం జరగ్గా మృణాల్ ఖండించారు. అయితే తాజా ప్రచారంపై ధనుశ్, మృణాల్ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
News January 15, 2026
కోకాకోలా $1B ఐపీఓ? క్లారిటీ ఇచ్చిన కంపెనీ

హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (HCCB) IPOపై వస్తున్న వార్తలను ఆ కంపెనీ తోసిపుచ్చింది. ఈ వేసవిలో లేదా సమీప భవిష్యత్తులో అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని సంస్థ ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాము కేవలం మార్కెట్లో పట్టు సాధించడం, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంపైనే ఫోకస్ పెట్టామన్నారు. GST వల్ల లభించిన ధరల ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నామని తెలిపారు. IPO వార్తలన్నీ ఊహాగానాలేనన్నారు.
News January 15, 2026
దేశ భద్రత విషయంలో ముందుంటాం: CM

TGలో మరో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆర్మీ అధికారులను CM రేవంత్ కోరారు. పదేళ్లుగా ఒక్క స్కూలును కూడా మంజూరు చేయలేదన్నారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని HYDకు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశ భద్రత అంశాల్లో సహకరించడంలో TG సర్కార్ ముందుంటుందని, లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్కు VKDలో 3వేల ఎకరాలు కేటాయించినట్లు HYDలో జరిగిన సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్లో గుర్తుచేశారు.


