News September 8, 2024
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ‘నేను దేశం తరఫున ఎన్నో ఏళ్లు క్రికెట్ ఆడా. యువకులకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలీ ఇప్పటికే 2సార్లు రిటైర్మెంట్ ప్రకటించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇకపై అలాంటి ప్రయత్నం చేయబోనని ఆయన స్పష్టం చేశారు. అలీ ENG తరఫున 68 టెస్టులు, 138 ODIలు, 92 T20లు, లీగ్‌లలో 352 మ్యాచ్‌లు ఆడారు.
Similar News
News October 5, 2024
అక్టోబర్ 5: చరిత్రలో ఈరోజు
1911: నటి, గాయని పసుపులేటి కన్నాంబ జననం
1975 : హాలీవుడ్ నటి కేట్ విన్‌స్లెట్ జననం
2001 : ఖాదీ ఉద్యమ నాయకురాలు కల్లూరి తులశమ్మ మరణం
2011 : యాపిల్ సంస్థ సహవ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ మరణం
1864 : కలకత్తాలో సంభవించిన పెను తుపానులో 60,000 మందికి పైగా మృతి
* ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం
News October 5, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 5, 2024
శుభ ముహూర్తం
తేది: అక్టోబర్ 5, శనివారం
తదియ పూర్తి
స్వాతి: రా.9.33 గంటలకు
వర్జ్యం: తె.3.45 నుంచి ఉ.5.32 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.5.59 నుంచి ఉ.6.46 గంటల వరకు
రాహుకాలం: ఉ.9.00 నుంచి మ.10.30 వరకు