News August 28, 2024

రాష్ట్రం జ్వరాంధ్రప్రదేశ్‌గా మారింది.. చర్యలేవీ?: షర్మిల

image

AP: రాష్ట్రాన్ని విష జ్వరాలు వణికిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని APCC చీఫ్ షర్మిల విమర్శించారు. ‘రాష్ట్రం జ్వరాంధ్రప్రదేశ్‌గా మారింది. ప్రభుత్వాసుపత్రుల్లో ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురికి చికిత్స అందిస్తున్న దుస్థితి ఉంది. గత సర్కారును తిడుతూ ఐదేళ్లు కాలయాపన చేస్తారా? వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి. పరిస్థితి అందుబాటులో వచ్చే వరకు సీఎం నేరుగా పర్యవేక్షించాలి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 9, 2024

RISHABH PANT: 634 రోజుల తర్వాత రీఎంట్రీ

image

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ 634 రోజుల తర్వాత టెస్టుల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. బంగ్లాదేశ్‌తో జరగబోయే తొలి టెస్టుకు పంత్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. రోడ్డు ప్రమాదం తర్వాత టీ20, వన్డేల్లో ఆడినా సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆయన ఇంకా ఆడలేదు. ఈ క్రమంలో బంగ్లా సిరీస్‌కు ఆయన ఎంపికయ్యారు. ఆ తర్వాత జరిగే బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి కూడా పంత్ ఎంపిక లాంఛనమే. ఆసీస్‌పై అతడి మెరుగైన గణాంకాలే ఇందుకు నిదర్శనం.

News September 9, 2024

జో రూట్ ఖాతాలో మరో రికార్డు

image

ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా రూట్ (12,402) అవతరించారు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో 11 పరుగుల వద్ద ఉన్నప్పుడు కుమార సంగక్కర (12,400) రికార్డును ఆయన అధిగమించారు. మరో 83 పరుగులు చేస్తే అలిస్టర్ కుక్ (12,472) రికార్డు కూడా రూట్ బద్దలుకొడతారు. అగ్ర స్థానంలో సచిన్ టెండూల్కర్ (15921) ఉన్నారు.

News September 9, 2024

నాటో పరిధిలో కుప్పకూలిన రష్యా డ్రోన్

image

రష్యాకు చెందిన ఓ సైనిక డ్రోన్ నాటో పరిధిలోని లాత్వియా దేశంలో తాజాగా కుప్పకూలింది. ఈ దేశాధ్యక్షుడు ఎడ్గర్స్ రింకెవిక్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. డ్రోన్ బెలారస్‌ మీదుగా తమ దేశంలో పడిందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఈమధ్య పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో ఉన్న లాత్వియా, తర్వాతి కాలంలో ప్రత్యేక దేశంగా మారి నాటో సభ్యదేశమైంది.