News December 14, 2024

బన్నీకి రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది : RGV

image

హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి ఫైరయ్యారు. ‘తెలంగాణకు చెందిన బిగ్గెస్ట్ స్టార్ అల్లు అర్జున్ భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్ అందించి రాష్ట్రానికి గొప్ప బహుమతి అందించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయన్ను జైలుకు పంపి బన్నీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది’ అని RGV ట్వీట్ చేశారు.

Similar News

News January 21, 2025

రిజిస్టర్డ్ పార్టీకి, రికగ్నైజ్డ్ పార్టీకి తేడా ఇదే

image

అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 స్థానాల్లో పోటీ చేసిన పార్టీలను రిజిస్టర్డ్ పార్టీలుగా ఈసీ పరిగణిస్తుంది. ఇలాంటి పార్టీలకు ఎలాంటి ప్రయోజనాలు అందవు. వీరికి ఓ తాత్కాలిక గుర్తును కేటాయిస్తారు. అలాగే అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో 6 శాతం ఓట్లను పొందితే దానిని <<15218607>>గుర్తింపు పొందిన<<>> రాజకీయ పార్టీగా ఈసీ గుర్తిస్తుంది. ఈ పార్టీలకు గుర్తుతోపాటు కొన్ని ప్రత్యేకాధికారాలను ఈసీ కేటాయిస్తుంది.

News January 21, 2025

అందుకే పనిష్మెంట్ ఇచ్చా: ఈటల

image

TG: తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరిపైనా చేయి ఎత్తలేదని, బూతులు తిట్టలేదని బీజేపీ MP ఈటల రాజేందర్ అన్నారు. కానీ పేదల భూములు కబ్జా అవుతున్నాయనే ఆవేదనతో, ధర్మాన్ని కాపాడేందుకు <<15213239>>ఇవాళ పనిష్మెంట్<<>> ఇచ్చానని చెప్పారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు అధర్మానికి కొమ్ము కాయడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి స్వయంగా చర్యలు తీసుకుని, ప్రజల ఆస్తులు కాపాడాలని డిమాండ్ చేశారు.

News January 21, 2025

BIG BREAKING: జనసేనకు ఈసీ గుర్తింపు

image

జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఆ పార్టీకి గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపింది. ఇంతకాలం రిజిస్టర్డ్ పార్టీగా ఉన్న జనసేన.. గుర్తింపు పొందిన పార్టీగా మారడంతో ఆ గుర్తును ఇకపై ఎవరికీ కేటాయించరు. 2014లో ఆవిర్భవించిన జనసేన ఆ ఏడాది ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో రాజోలు ఎమ్మెల్యే సీటు గెలిచింది. 2024లో పోటీ చేసిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు సొంతం చేసుకుంది.