News April 10, 2025
జగన్ నుంచి రాష్ట్రానికి భద్రత కావాలి: నిమ్మల

AP: వైసీపీ చీఫ్ జగన్కు మరింత భద్రత కేటాయించాలన్న ఎమ్మెల్సీ బొత్స వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల రామనాయుడు కౌంటర్ ఇచ్చారు. నేర స్వభావం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎవరికి భద్రత కావాలని ప్రశ్నించారు. భద్రత జగన్కు కాదని, ఆయన నుంచి రాష్ట్రానికి, ప్రజలకు కావాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం చంద్రబాబు సైతం తన పర్యటనల్లో సెక్యూరిటీని తగ్గించుకున్నారనే విషయాన్ని గుర్తు చేశారు.
Similar News
News November 15, 2025
VZM: కుష్టు వ్యాధిపై అవగాహన రథాన్ని ప్రారంభించిన DMHO

జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈ నెల 17 నుంచి 30 వరకు ఇంటింటి సర్వే ద్వారా కుష్టు కేసులను గుర్తించే “లెప్రసీ కేస్ డిటెక్షన్ కాంపెయిన్” జరగనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. జీవనరాణి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించే ఆటో ప్రచార రథాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అన్ని గ్రామాల్లో ప్రజలు ఆరోగ్య కార్యకర్తలకు సహకరించాలన్నారు.
News November 15, 2025
రేపు విజయవాడకు CJI జస్టిస్ గవాయ్

AP: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ రేపు విజయవాడకు రానున్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా ఏపీ హైకోర్టు లాయర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేస్తారు. ఈ ప్రోగ్రామ్లో సీఎం చంద్రబాబు, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్, ఇతర న్యాయమూర్తులు పాల్గొననున్నారు.
News November 15, 2025
SAతో తొలి టెస్ట్.. భారత్కు మెరుగ్గా విన్నింగ్ ఛాన్స్!

సౌతాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్సులో SA 93 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. జడేజా 4, కుల్దీప్ 2, అక్షర్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం 63 పరుగుల ఆధిక్యంలో సఫారీలు ఉన్నారు. క్రీజులో బవుమా(29), బాష్(1) ఉన్నారు. రేపు మిగతా 3 వికెట్లను త్వరగా కూల్చేస్తే IND గెలుపు నల్లేరుపై నడకే.
* స్కోర్లు: SA.. 159/10, 93/7; భారత్ 189/10


