News April 10, 2025

జగన్ నుంచి రాష్ట్రానికి భద్రత కావాలి: నిమ్మల

image

AP: వైసీపీ చీఫ్ జగన్‌కు మరింత భద్రత కేటాయించాలన్న ఎమ్మెల్సీ బొత్స వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల రామనాయుడు కౌంటర్ ఇచ్చారు. నేర స్వభావం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎవరికి భద్రత కావాలని ప్రశ్నించారు. భద్రత జగన్‌కు కాదని, ఆయన నుంచి రాష్ట్రానికి, ప్రజలకు కావాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం చంద్రబాబు సైతం తన పర్యటనల్లో సెక్యూరిటీని తగ్గించుకున్నారనే విషయాన్ని గుర్తు చేశారు.

Similar News

News April 20, 2025

వరల్డ్ కప్ కోసం భారత్ వెళ్లం: పాక్

image

భారత్‌లో జరగనున్న ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌లో తమ టీమ్ పాల్గొనబోదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ముందే జరిగిన ఒప్పందం ప్రకారం తటస్థ వేదికల్లోనే తాము ఆడతామని PCB ఛైర్మన్ నఖ్వీ తెలిపారు. ‘ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో భారత్ ఎలాగైతే మా దేశానికి రాకుండా న్యూట్రల్ వేదికల్లో ఆడిందో, మేము కూడా అలాగే ఆడతాం. WC ఆతిథ్య దేశమైన భారతే ఆ వేదికలను ఎంపిక చేయాలి’ అని నఖ్వీ అన్నారు.

News April 20, 2025

ఈ నెల 23 నుంచి భారత్-అమెరికా వాణిజ్య చర్చలు

image

ఈ నెల 23 నుంచి 3 రోజుల పాటు వాషింగ్టన్‌లో భారత్, అమెరికా వాణిజ్య చర్చలు జరపనున్నాయి. టారిఫ్స్ నుంచి కస్టమ్స్ వరకు పలు అంశాలపై ఈ చర్చల్లో ఇరు దేశాలు ఓ ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భారత బృందానికి వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజేశ్ అగ్రవాల్ నేతృత్వం వహించనున్నారు.

News April 20, 2025

‘డయాఫ్రం వాల్’ టెక్నాలజీపై మహారాష్ట్ర అధికారుల ఆరా

image

AP: పోలవరం ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను మహారాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు పరిశీలించారు. స్పిల్ వే, గేట్లు, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రం వాల్, జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. డయాఫ్రం వాల్ నిర్మాణంలో వాడుతున్న టెక్నాలజీ, ఉపయోగించే యంత్రాల వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత పట్టిసీమ ప్రాజెక్టునూ పరిశీలించారు.

error: Content is protected !!