News May 12, 2024
పోలింగ్‌కు ఎండ దెబ్బ పోయి.. వర్షం ముప్పొచ్చింది

తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ తెలపడంతో ఇది పోలింగ్‌కు ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎండల తీవ్రత వల్ల పోలింగ్ సమయాన్ని ఈసీ పెంచిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఎండలు పక్కనపెడితే వర్షంతో ముప్పొచ్చింది. అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఓటర్లు ఎండావానలను లెక్కచేయకుండా ఓటు వేసేందుకు తరలిరావాలి.
Similar News
News February 11, 2025
18వేల ఏళ్ల క్రితం యూరప్‌లో నరమాంస భక్షణ

సుమారు 18వేల ఏళ్ల క్రితం యూరప్‌లో నరమాంస భక్షణ జరిగేదని UK పరిశోధకులు తెలిపారు. పోలాండ్‌లోని ఓ గుహలో దొరికిన అవశేషాలపై అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందన్నారు. ‘ఆ ఎముకల మీద ఉన్న గుర్తుల్ని బట్టి అవి నరమాంస భక్షణకు గురైనట్లుగా గుర్తించాం. కాళ్లూచేతుల్ని ముక్కలుగా నరకడం, మెదడును బయటికి తీయడం వంటి పలు ఆనవాళ్లు వాటిపై ఉన్నాయి. 2 గ్రూపుల మధ్య యుద్ధంలో విజేతలు ఓడినవారిని తినేసి ఉండొచ్చు’ అని అంచనా వేశారు.
News February 11, 2025
ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్‌లోని ఎల్‌వోసీ వద్ద ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మరణించగా మరికొందరు గాయపడ్డారు. అఖ్నూర్ సెక్టార్‌లోని ఫెన్సింగ్ వద్ద భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది.
News February 11, 2025
ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ వికటించి చిన్నారి మృతి

AP: అల్లూరి(D) మారేడుమిల్లి(M) తాడేపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. <<15414061>>ఆల్బెండజోల్ ట్యాబ్లెట్<<>>(నులిపురుగుల నివారణ మాత్ర) వికటించి నాలుగేళ్ల చిన్నారి రస్మిత కన్నుమూసింది. అన్నం తిన్న వెంటనే ట్యాబ్లెట్ వేసుకున్న బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.