News April 1, 2024
జ్ఞానవాపిలో పూజలపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు
జ్ఞానవాపి మసీదులో పూజలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే హిందువులు చేసే పూజలు మసీదు సెల్లార్ ప్రాంతానికే పరిమితం కావాలని ఆదేశించింది. ముస్లిములు ఉత్తర ప్రాంతంలో తమ ప్రార్థనలను యథావిధిగా కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. కాగా అంతకుముందు మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజ్‌శాల ప్రాంతంలో సర్వేపై స్టే విధించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
Similar News
News November 8, 2024
CM పుట్టినరోజు.. ప్రజలంతా పూజలు చేయాలని కోరిన మంత్రి
TG: రేపు రాష్ట్రవ్యాప్తంగా సీఎం రేవంత్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, మెస్ ఛార్జీలు పెంచిన సందర్భంగా హాస్టళ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సెలబ్రేషన్స్ చేస్తామన్నారు. రేవంత్ రెడ్డిని ఆశీర్వదించేలా ప్రజలంతా పూజలు చేయాలని కోరారు. రుణమాఫీ, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ లాంటి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు.
News November 8, 2024
TGSRTC హోం డెలివరీ.. ధరలు ఇవే..
TG: ఆర్టీసీ GHMC పరిధిలో హోం డెలివరీ సర్వీస్‌ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. పార్సిల్స్ 1KG – ₹50, 5KG – ₹60, 10KG – ₹65, 20KG – ₹70, 30KG – ₹75, 30KGలకు పైనుంటే ₹75కు అదనంగా పైనున్న స్లాబ్‌ల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు 9030134242 లేదా 9030135252కి కాల్ చేయవచ్చు. GHMC పరిధిలో 31 ప్రాంతాల్లో ఈ సర్వీస్ ఉంటుంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది.
News November 7, 2024
ఛాంపియన్స్ ట్రోఫీ.. UAEలో భారత్ మ్యాచులు!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 హైబ్రిడ్ మోడల్‌లో జరిగే అవకాశం ఉందని PTI తెలిపింది. భారత్ తన మ్యాచులను యూఏఈలోని దుబాయ్ లేదా షార్జాలో ఆడనుందని పేర్కొంది. నవంబర్ 11న ఆ టోర్నీ షెడ్యూల్ అధికారికంగా వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. కాగా, తొలుత ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా పాకిస్థాన్‌లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. అక్కడికి వెళ్లేందుకు బీసీసీఐ నో చెప్పడంతో తాజాగా మార్పులు చేసినట్లు సమాచారం.