News September 29, 2024
లడ్డూ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ

తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ జరుగుతున్న ప్రచారంపై ఐదుగురు పిటిషన్లు వేశారు. దీనిపై రిటైర్డ్ సుప్రీంకోర్టు/హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు జరపాలని పిటిషనర్లు కోరారు. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సహా పలువురు ఈ పిటిషన్లు వేశారు.
Similar News
News January 25, 2026
వేరుశనగలో ఇనుపధాతులోపం.. నివారణ

ఆకులలో పత్రహరితం తయారవడానికి ఇనుపధాతువు కీలకం. ఇది లోపించినప్పుడు వేరుశనగ మొక్క ఆకులు పసుపు రంగుకు మారతాయి. క్రమంగా ఆకు కొనలు ఎండిపోతాయి. మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ఈ సమస్య నివారణకు 0.5 శాతంఅన్నబేధి(5గ్రా. లీటరు నీటికి), 0.1 శాతం నిమ్మఉప్పు(లీటరు నీటికి 1గ్రాము) కలిపిన ద్రావణాన్ని 4-5 రోజుల వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేసుకోవాలి.
News January 25, 2026
కెనడాపై 100% టారిఫ్స్ విధిస్తా: ట్రంప్

చైనాతో ట్రేడ్ డీల్‌పై ముందుకు వెళ్తే కెనడాపై చర్యలు తప్పవని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఆ దేశాన్ని సజీవంగా చైనా మింగేస్తుంది. వారి వ్యాపారాలు, సామాజిక నిర్మాణం, జీవన విధానాన్ని నాశనం చేస్తుంది. చైనా ఉత్పత్తులను అమెరికాకు పంపేందుకు కెనడాను డ్రాప్ ఆఫ్ పోర్టుగా ఉపయోగించాలనుకుంటే వాళ్లు పొరపాటు పడినట్లే. డీల్ చేసుకున్న మరుక్షణమే కెనడాపై 100% టారిఫ్స్ విధిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు.
News January 25, 2026
సూర్యుడు దేవుడా..?

కాలం అత్యంత శక్తిమంతమైనది. అది సృష్టిని నిర్మిస్తుంది. తిరిగి తనలోనే లీనం చేసుకుంటుంది. ఈ కాలం కంటికి కనబడదు. అలాంటి కాలాన్ని కొలిచే ప్రమాణమే సూర్యుడు. ఆయన వేసే ప్రతి అడుగు కాలానికి కొలమానం వంటిది. మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, రోజులు, నెలలు అన్నీ సూర్యుని గమనంపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే కంటికి కనిపించని దైవానికి, కంటికి కనిపించే రూపమే సూర్యుడని నమ్ముతాం. ఆయనను ప్రత్యక్ష దైవంగా కొలుస్తాం.


