News September 29, 2024
లడ్డూ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ జరుగుతున్న ప్రచారంపై ఐదుగురు పిటిషన్లు వేశారు. దీనిపై రిటైర్డ్ సుప్రీంకోర్టు/హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు జరపాలని పిటిషనర్లు కోరారు. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సహా పలువురు ఈ పిటిషన్లు వేశారు.
Similar News
News October 4, 2024
ఆ మ్యాప్‌ను తొలగించిన ఇజ్రాయెల్
జమ్మూకశ్మీర్‌లోని కొంత భాగాన్ని పాకిస్థాన్ భూభాగంగా తప్పుగా చిత్రీకరించిన భారత మ్యాప్‌ను ఇజ్రాయెల్ తొలగించింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఇజ్రాయెల్ తన అధికార వెబ్‌సైట్ నుంచి దాన్ని తొలగించింది. దీనిపై భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ మాట్లాడుతూ ‘ఇది వెబ్‌సైట్ ఎడిటర్ పొరపాటు. దీన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. మ్యాప్‌ను తొలగించాం’ అని తెలిపారు.
News October 4, 2024
పవన్ కళ్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ పరోక్ష ట్వీట్
నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్వీట్ చేశారు. ‘సనాతన ధర్మ రక్షణలో మీరుండండి. సమాజ రక్షణలో మేముంటాం. జస్ట్ ఆస్కింగ్’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. నిన్న వారాహి డిక్లరేషన్ సందర్భంగా సనాతన ధర్మం గురించి AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ‘నేనో పెద్ద సనాతన హిందువుని’ అని పవన్ ప్రకటించారు.
News October 4, 2024
వారం రోజులకు ‘దేవర’ కలెక్షన్లు ఎంతంటే?
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. గత నెల 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.405 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేయగా ప్రకాశ్ రాజ్, సైఫ్ అలీ ఖాన్, మురళీ శర్మ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.