News August 20, 2024
హత్యాచార ఘటనపై నేడు సుప్రీంకోర్టు విచారణ
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ జరపనుంది. దేశంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో సుప్రీంకోర్టు సుమోటోగా కేసు విచారణకు స్వీకరించింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ప్రధాన బెంచ్ కేసును విచారించనుంది. బాధితురాలికి న్యాయం జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
Similar News
News September 15, 2024
ఏఐ వల్ల ఉద్యోగాల కోత.. 67శాతం మంది ఇంజినీర్లలో టెన్షన్
కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయని 67.5శాతంమంది ఇంజినీర్లలో ఆందోళన నెలకొన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని గ్రేట్ లెర్నింగ్ సంస్థ తెలిపింది. నైపుణ్యాల్ని పెంచుకోకపోతే కెరీర్‌కు రక్షణ ఉండదని 87.5శాతం మంది అభిప్రాయపడ్డారని తెలిపింది. వచ్చే పదేళ్లలో 40శాతం వరకు జాబ్స్ ఏఐ పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో 89శాతం మేర ఇంజినీర్లు AI, MLలోనే కొత్త నైపుణ్యాల్ని నేర్చుకోవాలనుకుంటున్నారని పేర్కొంది.
News September 15, 2024
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
హీరోయిన్ మేఘా ఆకాశ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు సాయి విష్ణుని పెళ్లాడారు. ఆదివారం చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వీరి పెళ్లి జరగ్గా పలు రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు. శనివారం నిర్వహించిన రిసెప్షన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. లై, ఛల్ మోహన్ రంగా, పేట, కుట్టి స్టోరీ, డియర్ మేఘ, రాజ రాజ చోర వంటి చిత్రాల్లో మేఘా నటించారు.
News September 15, 2024
కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
TG: ఎమ్మెల్యేల పార్టీ మార్పు <<14105126>>వ్యాఖ్యలపై<<>> మాజీ మంత్రి కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతోందని అన్నారు. గాంధీనే తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని వ్యాఖ్యానించినట్లు తెలిపారు. మీ పార్టీ అంతర్గత సమస్యల్ని మీరే పరిష్కరించుకోవాలని కేటీఆర్‌కు హితవు పలికారు. ఎవరెన్ని చేసినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో తగ్గదన్నారు.