News June 29, 2024

T20WC 2024 టోర్నమెంట్ ఆఫ్ ది టీమ్ ఇదే: క్రికెట్ ఆస్ట్రేలియా

image

టీ20 ప్రపంచకప్-2024 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా బెస్ట్ ప్లేయర్లతో ‘టోర్నమెంట్ ఆఫ్ ది టీమ్’ను ఎంపిక చేసింది. 11 మందితో కూడిన ఈ జట్టుకు అఫ్గానిస్థాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా ఎంచుకుంది. భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించింది. జట్టు: రోహిత్ శర్మ, ట్రావిస్ హెడ్, నికోలస్ పూరన్(WK), ఆరోన్ జోన్స్, స్టొయినిస్, హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్ (C), రిషద్, నోర్ట్జే, బుమ్రా, ఫారూఖీ.

Similar News

News December 10, 2024

కుంభ‌మేళాకు 40 కోట్ల మంది భక్తులు!

image

Jan 13 నుంచి Feb 26 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న మ‌హా కుంభ‌మేళా- 2025కు ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి 40 కోట్ల మంది ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని UP ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది. భ‌క్తుల సంఖ్య‌ను క‌చ్చిత‌త్వంతో నిర్ధారించేందుకు AI కెమెరాల‌ను ఉప‌యోగించ‌నున్నారు. జనసమూహం నిర్వహణలో కొత్త మైలురాయిని సృష్టించడం సహా ఇలాంటి స్మారక కార్యక్రమాల్లో ప్రపంచ స్థాయిలో ఆదర్శంగా నిలవాలన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తోంది.

News December 10, 2024

జైళ్ల‌ శాఖలో ఖాళీల‌ వివ‌రాలివ్వండి.. రాష్ట్రాల‌కు సుప్రీంకోర్టు ఆదేశం

image

జైళ్ల శాఖ‌లో ఉన్న పోస్టులు, ఖాళీలు-వాటి భర్తీ చర్యల వివ‌రాలు స‌మ‌ర్పించాల‌ని అన్ని రాష్ట్రాల‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కారాగారాలు నిండిపోతుండ‌డంపై దాఖ‌లైన పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా జస్టిస్ హృషికేశ్ రాయ్‌ బెంచ్ ఈ ఆదేశాలిచ్చింది. జైళ్లు నిండిపోయి కారాగారాల్లో సిబ్బంది తక్కువగా ఉన్నప్పుడు ఖైదీలు, విచారణ ఖైదీల సమస్యలు పెరిగే అవకాశముందని పేర్కొంది. వివ‌రాలు స‌మ‌ర్పించేందుకు 8 వారాల గడువిచ్చింది.

News December 10, 2024

BREAKING: మోహన్ బాబుకు పోలీసుల నోటీసులు

image

TG: <<14843588>>మీడియాపై దాడి<<>> నేపథ్యంలో సీనియర్ నటుడు మోహన్ బాబుకు రాచకొండ సీపీ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు విష్ణు, మనోజ్‌కు నోటీసులిచ్చారు. వీరిని రేపు ఉదయం 10.30 గంటలకు CP కార్యాలయానికి హాజరు కావాలన్నారు. కాగా మోహన్ బాబు గన్‌ను పోలీసులు సరెండర్ చేసుకున్నారు. మరోవైపు అస్వస్థతకు గురైన మోహన్ బాబు ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.