News February 12, 2025

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లే లక్ష్యం: భట్టి

image

TG: బీసీలకు 42% రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో క్యాబినెట్‌లో తీర్మానం చేస్తామని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ‘శాసనసభలో బిల్లు ఆమోదించి చట్టబద్ధం చేయాలని నిర్ణయించాం. కులగణన బిల్లు కేంద్రానికి పంపి ఒత్తిడి తెచ్చి పార్లమెంట్‌లో ఆమోదానికి కృషి చేస్తాం. బీసీల రిజర్వేషన్లపై కలిసొచ్చే పార్టీలను కలుపుకొని పోతాం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లే మా లక్ష్యం’ అని భట్టి స్పష్టం చేశారు.

Similar News

News March 28, 2025

ముస్లింలందరూ నల్ల బ్యాండ్ ధరించాలి: AIMPLB

image

వక్ఫ్ సవరణ బిల్లు 2024కు వ్యతిరేకంగా ముస్లింలందరూ ఇవాళ శాంతియుత నిరసన చేపట్టాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) పిలుపునిచ్చింది. జుముఅతుల్-విదా రోజున (రంజాన్ నెలలో చివరి శుక్రవారం) మసీదులకు వచ్చేటప్పుడు చేతికి నల్ల బ్యాండ్ ధరించాలని పేర్కొంది. ఢిల్లీ, పట్నాలో ఇప్పటికే నిరసన కార్యక్రమాలు చేపట్టామని, ఈనెల 29న విజయవాడలో నిరసనకు దిగనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

News March 28, 2025

కుప్పకూలిన భవనం.. మరో మృతదేహం లభ్యం

image

TG: భద్రాచలంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా మరో మృతదేహాన్ని సిబ్బంది వెలికితీశారు. అతడిని భద్రాచలానికి చెందిన ఉపేందర్(38)గా గుర్తించారు. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరు మరణించారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

News March 28, 2025

ప్రభుత్వం సంచలన నిర్ణయం

image

TG: పదవీ విరమణ చేసి కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్న 6,729 మంది ఉద్యోగులను తొలగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో మెట్రోరైలు MD ఎన్వీఎస్ రెడ్డి, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు లాంటి వారు కూడా ఉండటం గమనార్హం. ఎవరి సేవలైనా కావాలనుకుంటే మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం వల్ల కొత్తగా 6వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు అవకాశం లభించనుంది.

error: Content is protected !!