News April 4, 2024
టీజర్ అదిరిపోతుంది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ ‘పుష్ప-2’. ఈ సినిమా టీజర్ ఏప్రిల్ 8న విడుదల కానుండగా మాస్ జాతర మరో నాలుగు రోజుల్లో అంటూ పుష్ప టీమ్ ట్వీట్ చేసింది. దీనికి ఓ ఫొటోను జతచేసి ‘పుష్ప ది రూల్ టీజర్.. ఉత్సాహం, ఉల్లాసం, అనుభూతిని పంచుతుంది’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న గ్రాండ్గా రిలీజ్ అవుతుందని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు.
Similar News
News January 25, 2026
తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మశ్రీలు

కేంద్రం ప్రకటించిన 113 పద్మశ్రీ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది ఎంపికయ్యారు. TG నుంచి సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో చంద్రమౌళి, కుమారస్వామి తంగరాజ్, కృష్ణమూర్తి, మెడిసిన్లో వెంకట్ రావు, విజయ్ ఆనంద్, రామారెడ్డి(పశు-వైద్య పరిశోధనలు), దీపికా రెడ్డి(కళా విభాగం) ఎంపికయ్యారు. AP నుంచి వెంపటి కుటుంబ శాస్త్రి(సాహిత్యం), కళా విభాగంలో బాలకృష్ణ ప్రసాద్, మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్ ఉన్నారు.
News January 25, 2026
వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేయండిలా..

ఈ రోజుల్లో ఎక్కువమంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే, ఓ వైపు ఆఫీస్.. మరోవైపు ఇల్లు.. రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. కాబట్టి మహిళలు తమ చుట్టూ హెల్పింగ్ మెకానిజంను ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి పనుల్లో కుటుంబసభ్యులు సాయం తీసుకోవాలి. కుదిరినప్పుడల్లా వారితో సమయం గడపాలి. ఆఫీస్లో వర్క్ లోడ్ ఎక్కువైతే సహోద్యోగులతో పని పంచుకోండి. అవసరమైనప్పుడు మీరూ వారికి సాయపడితే ఒత్తిడి తగ్గించుకోవచ్చు.
News January 25, 2026
బృహస్పతి చంద్రుడిపై జీవం ఉందా?

బృహస్పతి (Jupiter) చంద్రుడైన యూరోపాపై ఆసక్తికరమైన ప్రక్రియ జరుగుతోంది. బరువైన ఉప్పు మంచు గడ్డలు క్రమంగా లోపల ఉన్న సముద్రాన్ని చేరుతున్నాయి. దీంతో జీవం మనుగడకు అవసరమైన ఆక్సిజన్ వంటి పోషకాలు సముద్రంలోకి చేరుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ‘సింకింగ్ ఐస్’ విధానంతో జీవం మనుగడకు అవకాశం ఉంది. నాసా 2024లో ప్రయోగించిన ‘యూరోపా క్లిప్పర్ మిషన్’ 2030కి అక్కడికి చేరుకొని రహస్యాలను వెలికి తీయనుంది.


