News April 4, 2024
టీజర్ అదిరిపోతుంది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ ‘పుష్ప-2’. ఈ సినిమా టీజర్ ఏప్రిల్ 8న విడుదల కానుండగా మాస్ జాతర మరో నాలుగు రోజుల్లో అంటూ పుష్ప టీమ్ ట్వీట్ చేసింది. దీనికి ఓ ఫొటోను జతచేసి ‘పుష్ప ది రూల్ టీజర్.. ఉత్సాహం, ఉల్లాసం, అనుభూతిని పంచుతుంది’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న గ్రాండ్‌గా రిలీజ్ అవుతుందని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు.
Similar News
News February 8, 2026
భాను సప్తమి పూజా విధానం

తెల్లవారుజామునే నిద్రలేచి స్నానమాచరించాలి. ఉదయించే సూర్యుడికి అభిముఖంగా నిలబడి, రాగి పాత్రలో నీటితో అర్ఘ్యం సమర్పించాలి. పూజల ఎరుపు రంగు పూలు, ధూపం, దీపం సమర్పించాలి. సూర్య అష్టోత్తరం, గాయత్రీ మంత్రం జపించాలి. గోధుమలతో చేసిన వంటకాలు, పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. సూర్యుడి దివ్య కాంతిపై దృష్టి కేంద్రీకరించి ప్రార్థనలు చేయాలి. ఇలా చేస్తే మన అడ్డంకులన్నీ తొలగి, ఉన్నత స్థితికి చేరుతామని నమ్మకం.
News February 8, 2026
కనకాంబరం దిగుబడి పెరగాలంటే ఏం చేయాలి?

కనకాంబరం దిగుబడి పెరగాలంటే మొక్కలు పెరిగే తొలిదశలో కలుపు లేకుండా చూడాలి. వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించడానికి అవిసె మొక్కలను పెంచితే పాక్షిక నీడ ఏర్పడి మొక్కలు బాగా పెరిగి అధిక పూల దిగుబడి వస్తుంది. పూలు కోయడం పూర్తైన తర్వాత పూల గుత్తులను, ఎండు కొమ్మలను తొలగిస్తే ఏడాది పొడవునా పువ్వులు పూసి దిగుబడి పెరుగుతుంది. కనకాంబరం పువ్వులను రోజు విడిచి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోయాలి.
News February 8, 2026
శ్రీశైలంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

AP: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 18 వరకు జరగనున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రోజూ విశేష పూజలు, వాహనసేవలతో గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు, వీఐపీ స్పర్శ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే శివదీక్షా భక్తులకు ఈ నెల 12 వరకూ స్పర్శ దర్శనాలు కల్పిస్తారు.


