News December 31, 2024

పరకామణిలో చోరీపై మళ్లీ విచారించాలి: భాను ప్రకాశ్

image

AP: తిరుమల పరకామణిలో జరిగిన చోరీపై పునర్ విచారణ జరగాలని BJP నేత, TTD పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ డిమాండ్ చేశారు. గతంలో ధార్మిక క్షేత్రంలో అన్నీ దాపరికాలే అని విమర్శించారు. దొంగలను ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. స్వామి ఖజానాను కొల్లగొట్టిన వారిని వదలబోమని హెచ్చరించారు. చోరీకి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలతో CMను కలుస్తామన్నారు. TTDలో ఇంకా రెండుమూడు అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

Similar News

News January 25, 2025

దావోస్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ఫోకస్

image

AP: దావోస్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఆయన సీఎస్, సీఎంవో అధికారులతో సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దిగ్గజ సంస్థల సీఈఓలు, పలు దేశాల ప్రతినిధులు త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తారని సీఎం వారితో చెప్పారు. ఆ సమయంలో పెట్టుబడుల చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్‌కు చంద్రబాబు సూచించారు.

News January 25, 2025

MHలో భారీ పేలుడు.. 8కి చేరిన మృతుల సంఖ్య

image

మహారాష్ట్ర భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ <<15243613>>పేలుడు<<>> ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరినట్లు నాగపూర్ పోలీసులు వెల్లడించారు. ఉ.11గంటలకు ఘటన జరగ్గా, సహాయక చర్యలకు 8గంటల సమయం పట్టిందన్నారు. ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న 13మందిలో 8మంది చనిపోగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయని చెప్పారు. ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర CM ఫడణవీస్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

News January 25, 2025

రజినీకాంత్ ‘జైలర్ 2’లో బాలకృష్ణ?

image

సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కనున్న ‘జైలర్ 2’ మూవీ నుంచి ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని సమాచారం. బాలయ్య ప్రస్తుతం బోయపాటి తెరకెక్కించే ‘అఖండ 2’ మూవీతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయనున్నారు. ఇదే సమయంలో ‘జైలర్ 2‌’లో నటిస్తారని టాక్.